YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఓటు హక్కును వినియోగించుకోవాలి

ఓటు హక్కును వినియోగించుకోవాలి

ఖమ్మం
ఓటుహక్కు వున్న ప్రతిఒక్కరు తమ ఓటుహక్కును ఈ నెల 13న వినియోగించుకోవాలని ఖమ్మం లోకసభ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే అన్నారు.నేడు ఖమ్మం లోకసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణసామి, శంకర నంద్ మిశ్రా లతో కలిసి స్వీప్ కార్యాచరణ లో భాగంగా ఓటరు చైతన్యం కొరకు ఐడిఓసి లోని వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో చేపట్టిన బైక్ ర్యాలీని నూతన కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. బైక్ ర్యాలీలో రిటర్నింగ్ అధికారి తో పాటు, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జిల్లా స్వీప్ నోడల్ అధికారి, జిల్లా ఉపాధికల్పన అధికారి శ్రీరామ్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని, శ్రీ శ్రీ సర్కిల్, జెడ్పి సర్కిల్ గుండా ప్రధాన రహదారి వెంట కొనసాగి, పెవిలియన్ గ్రౌండ్ వద్ద ముగిసింది. దారిపొడవునా ప్రజాస్వామ్యం, ఓటు ప్రాముఖ్యత తెలుపుతూ సాగిన ర్యాలీలో జెడ్పి సెంటర్ వద్ద యువత దేశభక్తి గేయాలకు చేసిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.ర్యాలీ ముగింపు సందర్భంగా పెవిలియన్ గ్రౌండ్ వద్ద రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ఈ నెల 13న పోలింగ్ విషయమై ప్రతి ఒక్కరిని చైతన్య పరచాలన్నారు.జిల్లాలో పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, జనాభాలో 140 కోట్లతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న భారతదేశం అని అన్నారు.96 కోట్ల ఓటర్లు ఉన్న భారతదేశంలో ఎన్నికలు ఎలా జరుగుతాయి అని ప్రపంచదేశాల చూపు మనపైనే ఉందన్నారు.ఎన్నికల్లో గెలిచిన వారు పాలకులుగా శాసనాలు చేస్తారని, ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయని, ఓటు వేయకుంటే మనం ప్రశ్నించే హక్కును కోల్పోతామని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓట్ల పండుగలో ప్రతిఒక్కరు తమ ఓటు వేయాలని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ తక్కువగా జరుగుతున్నట్లు, దీనిని మేధావులు ఆలోచించాలని, దయచేసి ఓటుహక్కు ఉన్న వారు, తమ ఓటుహక్కు ఎక్కడ ఉంటే అక్కడ తప్పక వినియోగించుకోవాలని అన్నారు. ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ 96 శాతం పూర్తి చేసినట్లు, ఓటరు స్లిప్పు తీసుకొనని వారు, తమ ఓటు పోలింగ్ కేంద్రంలో నమోదై ఉంటే చాలని, వెళ్లి ఓటు వేయవచని ఆయన అన్నారు.     ఈ సందర్భంగా ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.       ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, అధికారులు, సిబ్బంది, యువత పాల్గొన్నారు.

Related Posts