YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

చంద్రగిరి కోటపై పిడుగులు

చంద్రగిరి కోటపై పిడుగులు
చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలం లో  రిత్రక కట్టడమైన చంద్రగిరి కోటపై పిడుగు పడింది.. రాజుల కాలం నాటి కోటపై పిడుగు పడటంతో రాజమహల్ గోపురంకు పగుల్లు ..వచ్చాయి. ప్రకృతి వైపరీత్యాల నుంచి కొటను సంరక్షించాల్సిన ఆర్కియాలజీ అధికారులు మొద్దు నిద్ర పోవడం వల్లనె పిడుగు పడి పగుల్లు వచ్చాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. 
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిన్న సాయత్రం కురిసిన అకాల వర్షాలకు భారీగా ఉరుములు మెరుపులు మెరిశాయి. ఈ నేపధ్యంలో రాజ మహల్ పైభాగాన ఏర్పాటు చెసియున్న గోపురం పగుల్లకు గురైంది. సహజంగా ఎత్తయిన ప్రాకారాలు, గాలి గోపురాల మీద పిడుగులు పడుతుంటాయి. వాటి నుంచి చారిత్రక కట్టడమైన చంద్రగిరి కోటను కాపాడెందుకు లైటింగ్ అరెస్ట్ లను ఏర్పాటు చేయాలి. ఇక్కడి అధికారులు ఆపని చెయకుండా నిర్లక్ష్యం చూపడంతో పిడుగు పడి గోపురం పగుల్లు వచ్చిందని ఇక్కడి అధికారులపై చర్యలు తీసుకువాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts