YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

గల్ఫ్ దేశం బహేరేన్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర 4 వ ఆవతరణ దినోత్సవ వేడుకలు

గల్ఫ్ దేశం బహేరేన్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర 4 వ ఆవతరణ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ర్టావతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ కు, రాష్ట్ర ప్రజలకు ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహరేన్ శాఖ తరుపున 4వ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరి పోరాటం  వల్లే స్వరాష్ట్రం కళ సాకారమైందన్నారు.  తెలంగాణ రాష్ట్రం నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని ఐదో వసంతంలోకి అడుగు పెడుతున్న తరుణంలో  కొవ్వోత్తులు వెలిగించి, పూలతో అమరవీరులకు నివాళులర్పించారు .అనంతరం కేకు కట్ చేసి ఆనందోత్సాలతో తెలంగాణ రాష్ట్ర 4 వ ఆవిర్భావ వేడుకలు బహెరేన్లో జరుకున్నారు. అమరుల త్యాగాలతోనే  తెలంగాణ కల సాకరమైందన్నారు బెహరేన్  టీఆర్ఎస్ సెల్ అధ్యక్షలు సతీష్ అన్నారు.  బహరేన్ లో  తెలంగాణా రాష్ట్ర ఆవతరణ దినోత్సవాలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా వుందన్నారు.  తెలంగాణ గల్ఫ్ ప్రవాసులకూ ఎలాంటి సమస్యలు వచ్చిన ఆదుకోవడానికి 50 కోట్ల నిధులతో ఎన్నారై సెల్ ను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు టీఆర్ ఎస్ బహెరెన్ వైఎస్ప్రెసిడెంట్ బొలిసెట్టి వెంకటేశ్.  గత నాలుగేళ్ళుగా చేపడుతున్న సంక్షేమ పథకంలు పింఛన్లు, కళ్యాణ లక్మి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మంచినీటి కోసం  మిషన్భగీరథ, సాగునీటి కోసం మిషన్ కాకతీయ 24గంటల విద్యుత్, ప్రాజెక్టులనిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి పథకాలతో ఇతర రాష్ర్టాలను ఆకట్టుకుంటున్నాయన్నారు. దేశంలో  ప్రధానమంత్రి, ఎ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా,రైతును రాజుగా చేయాలని రైతు రుణమాఫీ చేసి రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో గల్ఫ్ వలసలు కూడా కొంత తగ్గే ఆవకాముందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, డా రవి, సెక్రెటరీలు రాజేంధార్, రవిపటేల్, గంగాధర్, జాయంట్ సెక్రెటరీలు విజయ్, దేవన్న, రాజేందర్ రావు, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ ప్రమోద్, సాయన్న, సురేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Related Posts