YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పొలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎస్. డిల్లీరావు

పొలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎస్. డిల్లీరావు

విజయవాడ
13వ తేదీన పోలింగ్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం.  పోలింగ్ కోసం రిజర్వ్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాం.  మొత్తం 1592 పోలింగ్ స్టేషన్లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి ఎస్. డిల్లీరావు అన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు టెంట్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నాం.  మొబైల్ ఫోన్లు పోలింగ్ స్టేషన్లలోకి అనుమతించబడువు కాబట్టి, వీలైనంత వరకు తీసుకురావద్దు. ఎక్కువ మంది అభ్యర్థులుండి, రెండు బీయూలున్న చోట ఇబ్బందుల్లేకుండా సంబంధిత సిబ్బందికి శిక్షణనిచ్చాం.  ఉదయం గం.5.45లకు హాజరైన పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించబడుతుంది.  సాంకేతిక సమస్యలు తలెత్తితే, సత్వర పరిష్కారం కోసం నిపుణులతో పాటు, బెల్ ఇంజనీర్లను అందుబాటులో ఉంచాం.  సమస్య తలెత్తితే 15 నిమిషాల్లోగా పరికరాలను మార్చేలా మార్పించేలా జాగ్రత్తలు తీసుకున్నాం.  1200 ఓట్లు కంటే ఎక్కువ ఉన్న పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన చర్యలు చేపట్టాం.  పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శుక్రవారంతో ముగిసింది.  హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన మార్క్డ్ కాపీ సిద్ధం చేస్తున్నాం.  పోలింగ్ పరికరాలు 125 శాతం అందుబాటులో ఉన్నాయి.  స్ట్రాంగ్ రూమ్స్ సిద్ధంగా ఉన్నాయి. కౌంటింగ్ హాళ్లలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఎక్కడా రీపోలింగ్ కు ఆస్కారం లేకుండా ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాం.  ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన  అన్నారు.
పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ మాట్లాడుతూ  అన్ని శాఖలో సమన్వయంతో పోలీస్ శాఖ పని చేస్తోంది.  332 ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించాం.  ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశాం.  అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.  పెద్ద ఎత్తున మద్యం, నాటుసారా సీజ్ చేశాం.  ఉచితాల పంపిణీని అడ్డుకుంటున్నాం.  శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని అదుపులోకి తీసుకున్నాం. పారదర్శకంగా, శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించేందుకు అందరూ సహకరించాలి.  సమస్యలు సృష్టించాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.  బయటి వ్యక్తులు శనివారం సాయంత్రం 6 గంటల్లోగా నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని అన్నారు.

Related Posts