YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇక ప్రలోభాల ఎర

ఇక ప్రలోభాల ఎర

విజయవాడ, మే 11
ఎండలను సైతం లెక్కచేయకుండా పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు అన్ని పార్టీల నాయకులు. నవరత్నాలని వైసీపీ అంటుంటే.. సూపర్ సిక్స్ హామీలతో టీడీపీ, జనసేనలు దూసుకుపోతున్నాయి. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి నేతలు ఎక్కడికక్కడ వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ.. ఆలోచించి ఓటేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. మరోవైపు షర్మిల తనదైన స్టైల్‌లో అన్న జగన్‌ని టార్గెట్ చేస్తూ న్యాయాన్ని గెలిపించాలని కడప వాసుల్ని కోరుతున్న తీరు ఆలోచింపచేస్తుందంటున్నారు.జగన్ సర్కారు మద్యంపాలసీ, ఇసుక దందాలు, వైసీపీ నేతల అరాచకాలపై ఫైర్ అవుతూ ఎన్నికల ప్రచారంలో క్లైమాక్స్ పంచ్‌లు విసురుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. నవరత్నాల పేరుతో జగన్ ప్రజలకు చాక్లెట్ ఇచ్చి.. నెక్లెస్‌లు తీసుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖలో వైసీపీ నేతలు భూములు ఆక్రమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రుషికొండకు బోడుగుండు చేశారని మండిపడ్డారు. విశాఖలో ప్రతిపక్షనేతలను తిరగనివ్వలేదని ఆరోపించారు.జగన్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకరస్థితికి చేరయనడానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉదంతమే నిదర్శమని మండిపడ్డారు.ఎంపీగా రఘురామరాజుని తన నియోజకవర్గంలో తిరగనీయకుండా చేసిన సైకో జగన్‌ని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.అరాచక ప్రభుత్వానికి అంతం పలకాలంటే  ఎండకు భయపడి ఎవరూ ఇంట్లో కూర్చోకూడదని. ఓటర్లు ఇంట్లో ఉంటే వైసీపీ గొడ్డలి మీ ఇంటికి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పవన్ పోరాటం వలనే కూటమి ఏర్పడిందని పవన్ రియల్ లైఫ్‌లో కూడా హీరోయే అని చంద్రబాబు ప్రశంసించారు.కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వారాహి రథ యాత్రతో రాష్ట్రాని చుట్టి వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుతో ప్రజాగళం సభలో పాల్గొని జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శాంతిభద్రతల్ని భగ్నం చేసి.. భూముల్ని మింగేసి.. వనరుల్ని దోచేసే జగన్ లాంటి వ్యక్తి వ్యవస్థకు చాలా ప్రమాదమని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ప్రజలు పడిన కష్టాలు, అనుభవించిన బాధలు.. వైసీపీని కూకటివేళ్లతో పెకలించబోతున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి ఏర్పాటుకు ప్రజాగ్రహమే ఊపిరులూదిందని ఆ జనాగ్రహమే రేపు జగన్ను ఓడించి తీరుతుందని స్పష్టం చేస్తున్నారు.పీసీసీ అధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అటు జగన్‌తో పాటు టీడీపీ, బీజేపీలను ఒక రేంజ్లో టార్గెట్ చేస్తూ వచ్చారు వైఎస్ షర్మిల.. న్యాయయాత్రతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. ప్రచారముగింపు దశలో మీడియా ముఖంగా వాయిస్ వినిపిస్తున్న పీసీసీ ప్రెసిడెంట్.. తాను ఎంపీగా పోటీ చ చేస్తున్న కడపపైనే ఫోకస్ పెట్టారు. చెల్లెలి దూకుడుతో ఉలిక్కి పడ్డ జగన్ ఆమెనే టార్గెట్ చేస్తున్నారు.షర్మిల రాజకీయ కాంక్ష వల్లనే కుంటుంబంలో కలహాలు ఏర్పడ్డాయన్న జగన్ వ్యాఖ్యలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ కాంక్ష.. డబ్బు కాంక్ష ఉంటే.. సీపీని జగన్ కు వదిలేదాన్ని కాదని షర్మిల అన్నారు. జగన్ జైల్లో ఉంటే కాళ్లకు బలపాలు కట్టుకుని పాదయాత్ర చేశానని.. జగన్ కోసం పడ్డ కష్టానికి రాజకీయ కాంక్ష అనే బహుమానం ఇచ్చారని కన్నీటి పర్యంతమయ్యారు. చెల్లెలిని నాశనం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. వివేకా హ్యతతో పాటు , వైఎస్ మరణానికి సంబంధించి జగన్‌పై ఘాటైన విమర్శలు చేస్తూ ఓటర్లను ఆలోచింపచేస్తున్నారు.

Related Posts