YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

ఎక్కువగా తింటే శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరు

ఎక్కువగా తింటే శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరు

జీవితంలో శృంగారం ఒక భాగం. శృంగారం గురించి మాట్లాడుకోవడం, ఆ విషయాలు తెలుసుకోవడం అంటే తప్పు అనే అపోహ సరికాదు. శృంగారం ముందు, శృంగారం తర్వాత ఎటువంటి పనులు చేయాలో? చేయకూడదో? యువకులే కాదు 40 ఏళ్ల వయస్కుల్లోనూ చాలామందిలో కొన్ని అపోహలు, అనుమానాలు ఉన్నాయి. శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే రాత్రి భోజనం విషయంలో కాస్త జాగ్రత్త అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. డిన్నర్ హెవీగా తీసుకుంటే.. శృంగారంలో ఆసక్తి తగ్గిపోతుందని సూచిస్తున్నారు. పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నా...రాత్రిపూట ఎక్కువగా భోజనం తీసుకునే వారు శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరని చెబుతున్నారు. 

కడుపు నిండుగా పీకల వరకు డిన్నర్ చేస్తే.. రతిక్రీడలో వారు చురుకుదనం కోల్పోతారు. తద్వారా శృంగారంలో వారు ఫెయిల్ కావడంతో పాటు, జీవిత భాగస్వామిని కూడా సంతృప్తిపరచలేరు. రతిక్రీడలో విజేతగా నిలవాలంటే.. కడుపులో కాస్త ఖాళీ ఉంచడమే బెటరని సలహా ఇస్తున్నారు. ఇది ఆడ, మగ ఇద్దరికీ వర్తిస్తుంది.  ఆరోగ్యవంతంగా ఉన్నా శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించలేని పక్షంలో...ఈ సలహాను ఒకసారి పాటించి చూడండి. ఆనందమయమైన శృంగారంతో మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. 

Related Posts