YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈ రెండు రోజులు అత్యంత కీలకం

ఈ రెండు రోజులు అత్యంత కీలకం

బద్వేలు
ఈ రెండు రోజులు చాలా కీలకం. పక్కా ప్రణాళిక, పటిష్టమైన సూక్ష్మ కార్యాచరణతో ఎన్నికలను విజయవంతం చేయాలి. పండుగ వాతావరణంలో పోలింగ్ నిర్వహణ ఉండాలని కలెక్టర్  జిల్లా ఎన్నికల అధికారి యం. అభిషిక్త్ కిషోర్ ఎన్నికలలో పాల్గొంటున్న అధికారులు సిబ్బందికి ఉద్బోధించారు.శనివారంరాయచోటి కలెక్టరేట్ నుండి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, ఎంపీడీవోలు, సెక్టోరల్ అధికారులు, విద్యుత్ వైద్య శాఖ అధికారులు తదితరులతో మే 13న పోలింగ్ సందర్భంగా వివిధ అంశాలలో తీసుకోవాల్సిన చర్యలు, చేయవలసిన ఏర్పాట్లు, కార్యాచరణ అమలు తదితరాలలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరించడంతో పాటు ఆయా ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూభారత ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో జాగ్రత్తగా ఆయా అంశాల ప్రక్రియలను పూర్తి చేసుకున్నాం. ప్రస్తుతం రాబోయే మూడు రోజులు ఎంతో కీలకం. 72 గంటల ప్రోటోకాల్ ప్రకారం.నిఘా మరియు ప్రవర్తన నియమావళి సమర్థవంతంగా అమలు చేయాలి. జిల్లా ఎన్నికల అధికారులు ఒక బృందంలా పనిచేయాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ సమస్య పరిష్కారంలో భాగం కావాలి. నిష్పక్షపాతంగా ఉంటూ,పోలింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలి. రిటర్నింగ్ అధికారులు ఎంపీడీవోలు పోలీసులు 72 గంటల ప్రోటోకాల్ అమలులో కీలకంగా వ్యవహరించాలి. మే 11 సాయంత్రం 6 గంటల నుంచి సైలెంట్ పీరియడ్ ఉంటుంది. 48 గంటల ముందుగా అన్ని లాడ్జిలు, కళ్యాణమండపాలు, హోటల్స్, పబ్లిక్ గుమికూడే ప్రదేశాలలో పోలీసులతో కలిసి ఎంపీడీవోలు స్వయంగా తనిఖీలు చేసి నియోజకవర్గం వెలుపల నుండి వచ్చిన రాజకీయ పార్టీల కార్యకర్తలు, ఇతర ప్రచార కార్యకర్తలు, ఓటర్లు కాని వారు ఉండకుండా స్వయంగా పర్యవేక్షణ చేయాలి. ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి మరియు పోలీస్ చెక్ పోస్ట్ లను తనిఖీలు చేయాలి. ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల వ్యవధిలో లౌడ్ స్పీకర్లు, బహిరంగ ప్రచారాలు, ఎలక్ట్రానిక్ చానల్స్ లో ప్రచారాలు, బల్క్ ఎస్ఎంఎస్ లు అనుమతించబడవు. ప్రింట్ మీడియాలో ప్రచారానికి ఎంసిఎంసి కమిటీ మీడియా సర్టిఫికేషన్ పొంది ఉండాలి.
పోలింగ్ కేంద్రాల సన్నద్ధత:పోలింగ్ కేంద్రాల వద్ద నూరు మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం చేయరాదు. రాజకీయ ప్రచార సామాగ్రి పోస్టర్లు,బ్యానర్లు, ఫోల్డర్లు ఉండరాదు. పోలింగ్ కేంద్రాలలో ర్యాంపు, టాయిలెట్, త్రాగునీరు, క్యూపై షేడ్ ఏర్పాటు ఉండేలా ఎమ్మార్వోలు, సెక్టార్ అధికారులు చర్యలు తీసుకోవాలి. అలాగే అవసరమైన చోట పోలింగ్ కేంద్రం వద్ద ఓ పెద్ద షామియాన కుర్చీలు ఏర్పాటు చేయాలి. బిఎల్ఓ లతో ఓటర్ల సహాయ డెస్క్ ఏర్పాటు ఉండాలి.
విద్యుత్ సౌకర్యం:ప్రతి పోలింగ్ కేంద్రం లోపల, బయట వెలుతురు ఉండాలి. ఎందుకు తగ్గిన విధంగా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి.  పోలింగ్ కేంద్రం కు వచ్చే ప్రతి దారిలో చుట్టుపక్కల స్ట్రీట్ లైట్లు ఉండాలి. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బిఎల్వోలు, విద్యుత్ లైన్మెన్ ఉండాలి. నిరంతరాయ విద్యుత్ సౌకర్యం ఉండాలి. ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించాలి. వీల్ చైర్స్ అందుబాటులో ఉండాలి. సాక్ష్యం పోర్టల్ లో ఏదైనా విజ్ఞప్తి వస్తే ఆ పిఎస్ లో  వీల్ చైర్ ఏర్పాటు చేయాలి.
వైద్య శిబిరం:
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వైద్య శిబిరం తప్పకుండా ఉండాలి. వేసవి దృష్ట్యా ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ప్రాథమిక చికిత్స అవసరమయ్యే మందులు ఉంచుకోవాలి. నియోజకవర్గ కంట్రోల్ రూమ్ లో మెడికల్ అధికారి ఉండాలి.
బ్యారికేడింగ్:ప్రతి పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లడానికి బయటికి రావడానికి ఒకటే దారి ఉండాలి. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మేర పురుషులు, మహిళలు/గర్భిణులు, వృద్ధులకు విడివిడిగా బారికేడింగ్ చేసుకోవాలి.
ఉద్యోగుల సంక్షేమం:పోలింగ్ విధులలో పాల్గొనడానికి వచ్చే ఉద్యోగులు ముందు రోజు పోలింగ్ కేంద్రంలో ఉంటారు కాబట్టి కనీస వసతులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారందరికీ నిబంధనల మేరకు వర్తించే టిఏ, డిఏ లను రిసెప్షన్ కేంద్రంలో చెల్లించాలి.
వెబ్ కాస్టింగ్:పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ బాగా పని చేయాలి. ఏదైనా సాంకేతిక సమస్య వస్తే వెంటనే పరిష్కరించుకోవాలి. డ్రైరన్ లో పిడిఎంఎస్, వెబ్ కాస్టింగ్ అంశాలను చెక్ చేసుకోవాలి.
జిపిఎస్ ట్రాకింగ్:ఈవీఎంలను ట్రాన్స్పోర్ట్ చేసే ఏ వాహనానికైనా జిపిఎస్ ట్రాకింగ్ అమర్చుకోవాలి. సెక్టోర్ అధికారుల వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరిగా ఉండాలి. షాడో ఏరియా లపై సెక్టర్ అధికారులు పర్యవేక్షణ చేయాలి.
మీడియా:రహస్య ఓటింగ్ పద్ధతికి భంగం కలిగిస్తూ ఓటింగ్ కంపార్ట్మెంట్ నందు వీడియోలు ఫోటోలు తీయరాదు. అభ్యర్థులు ఓటు వేసిన పిదప నూరు మీటర్ల పరిధిలో ఎలాంటి ఇంటర్వ్యూలు చేయరాదు.
కంట్రోల్. రూమ్:
నియోజకవర్గంలోని కంట్రోల్ రూములు నేటి నుంచి 14 వరకు అప్రమత్తంగా ఉండాలి. నిర్దేశిత సమయానికి అన్ని నివేదికలు కంట్రోల్ రూమ్ ద్వారా పంపాలి. వెబ్ కాస్టింగ్ జిపిఎస్ ట్రాకింగ్ పై రిటర్నింగ్ అధికారులు కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేయాలి.
కమ్యూనికేషన్ ప్లాన్:ఏదైనా సంఘటన జరిగిందని సమాచారం వస్తే వాస్తవ సమాచారాన్ని తెలుసుకోగలగాలి. ఇందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
డిస్ట్రిబ్యూషన్:సెక్టార్ వారిగా డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేసుకోవాలి.  ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వరాదు. పోల్ పార్టీలు అందరూ వచ్చారా లేదా చెక్ చేసుకోవాలి. పోల్ పార్టీకి ఏదైనా సందేహం వస్తే ఈవీఎం హాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉండాలి. పోల్ మెటీరియల్ చెక్ చేసుకోవాలి. ఎన్ని బస్సులు వస్తున్నాయి, ఏఏ డిపోలు వస్తాయి, ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు ఎన్ని, వాటి పార్కింగ్ అన్ని పక్కా ప్రణాళికతో అమలు చేయాలి. పోల్ పార్టీ అందరూ ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేలా తగిన పర్యవేక్షణ చేయాలి.
పోలింగ్ రోజు:నిర్దిష్ట సమయం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యేలా చూడాలి. వెబ్ కాస్టింగ్, శాంతిభద్రతలు పర్యవేక్షించాలి. ప్రతి సెక్టార్ అధికారితో బెల్ ఇంజనీర్ ఉంటారు. ఎక్కడైనా ఈవీఎం సమస్య వస్తే వెంటనే క్విక్ రెస్పాన్స్ టీం అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. నాట్ పోల్ లేదా రెగ్యులర్ పోలింగ్ సమయంలో ఈవీఎంలను మార్చాల్సి వస్తే ఆ సమాచారాన్ని వెంటనే సంబంధిత అధికారులకు కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలి. ఎప్పటికప్పుడు పిడిఎంఎస్, ఎన్కోర్లో డేటా ఎంట్రీ చేయాలి. శాంతిభద్రతల పర్యవేక్షణ ఉండాలి.
రిసెప్షన్:పోలింగ్ ముగిసిన అనంతరం రిసెప్షన్ కేంద్రానికి వచ్చే ఈవీఎంలను పిఎస్ వారీగా, సెక్టార్ వారిగా రిసీవ్ చేసుకుని అసెంబ్లీ, పార్లమెంట్ పరంగా విడివిడిగా జాగ్రత్తగా భద్రపరచాలి. పోలింగ్కు సంబంధించిన అన్ని నివేదికలు పిఓ నుంచి పొందాలి.
సమర్థ యాప్:ఎన్నికల కమిషన్ నూతనంగా ప్రవేశపెట్టిన సమర్థ యాప్ లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. గత అనుభవాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో పారదర్శకంగా విధులు నిర్వహించి ఎన్నికల విజయవంతానికి కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఆర్ఓ సత్యనారాయణరావు, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, ఎంపీడీవోలు, సెక్టోరల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts