తిరుపతి,
పోలింగ్ సిబ్బంది మూడవ దఫా ర్యాండమైజేషన్, మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ ఈసిఐ నిర్దేశిత వెబ్సైట్ నందు సార్వత్రిక ఎన్నికలు 2024 సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, కే.జ్యోతి (వర్చువల్ గా హాజరయ్యారు) గారి సమక్షంలో మరియు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో పకడ్బందీగా పూర్తి అయిందని, తద్వారా ఎన్నికల పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించబడిన నియోజక వర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో రేపు ఉదయం 7.30 గం.లకు తప్పక హాజరు కావాలని, ఎలాంటి మినహాయింపు లేదని, హాజరు కాని పక్షంలో ఎన్నికల నిబంధనల మేరకు క్రమ శిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు ఎన్నికల కమిషన్ సూచనల మేరకు నిర్దేశిత వెబ్సైట్లో డిఈఓ లాగిన్ నందు పోలింగ్ సిబ్బంది మూడవ దఫా ర్యాండమైజేషన్, మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ ఈసిఐ నిర్దేశిత వెబ్సైట్ నందు సార్వత్రిక ఎన్నికలు 2024 సాధారణ పరిశీలకులు కే.జ్యోతి సమక్షంలో మరియు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో పకడ్బందీగా చేపట్టి పారదర్శకంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు.
అసెంబ్లీ కి సంబంధించిన ఏడు నియోజకవర్గాలకు, తిరుపతి పార్లమెంటు నియోజక వర్గానికి సంబంధించిన ప్రిసైడింగ్ అధికారులు 2430, సహాయ ప్రిసైడింగ్ అధికారులు 2444, ఇతర పోలింగ్ సిబ్బంది 9895 మంది రిజర్వ్ తో మొత్తం కలిపి 14769 మందిని, మైక్రో అబ్జర్వర్లు 1036 మంది రిజర్వ్ తో కలిపి వారి వివరాలను NIC సాప్ట్ వేర్ నందు ఆన్లైన్ ద్వారా ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. తద్వారా ఎన్నికల పోలింగ్ విధులు కేటాయించబడిన సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు వారికి కేటాయించబడిన నియోజక వర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో రేపు ఉదయం 7.30 గం.లకు తప్పక హాజరు కావాలని, హాజరు కాని పక్షంలో ఎన్నికల నిబంధనల మేరకు క్రమ శిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో డిఆర్ ఓ పెంచల కిషోర్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు, ఐ.టి నోడల్ అధికారి వేంకటేశ్వర రావు, తదితర అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, తదితర అధికారులు పాల్గొన్నారు.