YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనం మూడ్ ఎలా ఉంది

జనం మూడ్ ఎలా ఉంది

కాకినాడ, మే 14,
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. గత ఎన్నికల్లో తమ నియోజవకర్గంలో పోటీచేసే అభ్యర్థిని చూసి ఓటు వేసే వారు. అంతేకాదు.. స్థానికంగా ఉన్న సమస్యలు.. సామాజికవర్గం ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి ఓటు వేసేవారు. ఎప్పుడూ ఏపీలో ఆ రకమైన పోలింగ్ సరళి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం దానికి భిన్నంగా కనపడుతుంది. జిల్లాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి ఏపీలో ఎన్నికలు ఇప్పుడు విభిన్నంగా జరిగాయనే చెప్పాలి. ఎవరిని అడిగినా ఎమ్మెల్యే అభ్యర్థి పేరు చెప్పడం లేదు. జగన్ లేదా చంద్రబాబు అంటున్నారు తప్పించి తాము ఓటు వేసిన అభ్యర్థి పేరు చెప్పలేని పరిస్థితి నెలకొంది.గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి ఉండేది కాదు. లోకల్ నాయకుడిని చూసి ఓటేసేవారు. కానీ ఈరోజు దానికి భిన్నంగా పోలింగ్ జరిగిందనే చెప్పాలి. ఎవరిని అడిగినా పార్టీ గుర్తు పేరు చెబుతున్నారు తప్పించి ఎవరూ ఫలానా అభ్యర్థికి ఓటు వేశామని చెప్పలేకపోతున్నారు. అంటే ఈసారి రూరల్ గాని.. అర్బన్ గాని కేవలం గుర్తుల ఆధారంగానే ఓటర్లు తమ ఓటును నొక్కేసి వచ్చారనుకోవాలి. తమ నియోజకవర్గం అభివృద్ధి అనే దానిని పక్కన పెట్టి తమకు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రయోజనం అన్న కోణంలో ఆలోచించి మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పాలి. అంటే అటు జగన్ అన్నా కావాలి అనుకోవాలి. లేదంటే చంద్రబాబు రావాలి అనుకున్నారు తప్పించి మరో ఆలోచన ఈసారి ఓటర్లు చేయలేదన్నది గ్రౌండ్ లెవెల్ రిపోర్టు ప్రకారం అర్థమవుతుంది. అయితే ఏపీలో కొత్తగా ఇద్దరినీ ప్రత్యేకంగా చూసేదేమీ లేదు. గతంలో చంద్రబాబు పాలనను ఐదేళ్ల పాటు చూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే చంద్రబాబు పాలనను పథ్నాలుగేళ్ల పాటు చూశారు. దీంతో చంద్రబాబు పాలన జనాలకు కొత్తేమీ కాదు. అలాగే జగన్ పాలనను ఐదేళ్ల నుంచి చూశారు. ఈ ఇద్దరిలో తమకు ఎవరి వల్ల ఉపయోగం ఉంటుందా? అన్న కోణంలోనే ఓటర్లు ఆలోచించి బటన్ నొక్కారు తప్పించి మరేరకమైన ఆలోచన చేయలేదు. నగదు పంపిణీ పెద్దయెత్తున జరిగినప్పటికీ తాము అనుకున్న వారికి మాత్రమే ఓటు వేశారు. రూరల్ లో గాని, అర్బన్ లో గాని తమకు వ్యక్తిగతంగా ప్రయోజనం చేకూరుస్తారు అని భావించిన వారికే ఓటర్లు మద్దతుగా నిలిచారని మాత్రం చెప్పుకోవాలి. అది ఎవరంటే చెప్పలేని పరిస్థిితి. ఏ పార్టీకి సానుకూల వాతావరణం కనిపించడం లేదు. అలాగని వ్యతిరేకత లేదు. మొత్తం మీద ఏపీలో పోలింగ్ అయితే గుంభనంగా జరిగిందనే చెప్పాలి. ఎవరు అధికారంలోకి వస్తారన్నది తెలియాలంటే మాత్రం జూన్ 4వ తేదీ వరకూ వెయిట్ చేయాల్సిందే.
పల్లెల్లో పోటు...
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. పల్నాడు, రాయలసీమలోని కొన్ని జిల్లాలను మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందనే చెప్పాలి. ప్రధానంగా మహిళలు, వృద్ధులు కూడా పెద్దయెత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం ఈసారి ప్రత్యేకత. ఇళ్లలో ఉండకుండా తాము ఓటు వేయాలన్న తపన వారిలో కనిపిస్తుంది. ఎక్కువ మంది ఓటర్లు రోజు వారీ కూలీల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసుకునే వారు వరకూ పోలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యులవ్వడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఇప్పటికే రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో సొంత గ్రామాలకు చేరుకున్న ఓటర్లు తిరుగు ప్రయాణం ఈరోజు అయ్యేందుకు ఉదయాన్నే ఓట్లు వేశారు. రేపటి నుంచి మళ్లీ విధులకు హాజరు కావాల్సి ఉండటంతో వాళ్లంతా ముందుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ఇక గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు క్యూ కట్టారనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఓటును ఈవీఎంలో నిక్షిప్తమయ్యేలా ఈసారి గ్రామీణ ఓటరు కసితో కనిపించాడని చెప్పాలి. గ్రామాల్లోని అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలన్నీ ఓటర్లతో నిండిపోయి ఉన్నాయి. ఒక్కసారిగా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి తరలి రావడంతో పోలింగ్ ప్రక్రియలో ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. వాళ్ల ఓటరు ఐడీని పరిశీలించడంతో పాటు వారి పేరు ఓటర్ల జాబితాలో ఉందో? లేదో? సరిచూసుకోవడం వంటివి చేయడం కారణాలతో పాటు ఏజెంట్ల నుంచి అంగీకారం తీసుకున్న తర్వాతనే ఓటు వేయడానికి అనుమతిస్తున్నారు. దీంతో పోలింగ్ జరగడానికి కొంత ఆలస్యమయింది. గ్రామాల్లో మాత్రం పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ కట్టారనే చెప్పాలి.అర్బన్ ప్రాంతాల్లో ఓటర్లు పెద్దగా ఓట్లు వేసేందుకు ముందుకు ఈసారి కూడా రాలేదు. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో యాభై శాతానికి మించి పోలింగ్ నమోదు కాలేదు. అర్బన్ లో ఎప్పుడూ ఓట్లు వేయడానికి ముందుకు రారు. అయితే ఈరోజు ఉదయాన్నే అర్బన్ ఏరియాల్లోని స్లమ్ ప్రాంతాల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. అయితే అర్బన్ ప్రాంతంలో కూడా రికార్డు స్థాయిలో ఈసారి పోలింగ్ నమోదవుతుందని అందరూ అంచనా వేశారు. కానీ అక్కడ క్యూ లైన్ లు చూసి అర్బన్ ప్రాంతాల్లో అనేక చోట్ల ఓటు వేయకుండా చాలా మంది వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో పోలింగ్ శాతం విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రాంతాల్లో తక్కువగా పోలింగ్ నమోదయింది. పట్టణ ప్రాంతాల్లో ఎండ వేడిమి తాళలేక, క్యూ లైన్ లో ఎక్కువ సేపు వేచి ఉండలేక ఓటర్లు వెనుదిరిగి వెళ్లారని చెబుతున్నారు

Related Posts