గత నెల 22న జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45లో ఉన్న ఫ్యాట్ పీజియన్ పబ్‌కు మనోజ్ వెళ్లాడు. అప్పటికే రాత్రి 11.30 గంటలు కావడంతో నిర్వాహకులు డీజే సౌండ్ తగ్గించారు. సౌండ్ పెంచాలని మనోజ్ కోరినా వారు వినిపించుకోకపోవడంతో ఆగ్రహంతో రెచ్చిపోయాడు. స్పీకర్లను పగలగొట్టాడు. మనోజ్‌పై ఫిర్యాదు చేసేందుకు పబ్ నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు. అయితే, జనరల్ డైరీ (జీడీ)లో మాత్రం ఈ ఘటనను నమోదు చేసినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.