YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ సర్కార్ లెక్క ఇది

కాంగ్రెస్ సర్కార్ లెక్క ఇది

న్యూఢిల్లీ, మే 14
లోక్సభ ఎన్నికల పర్వంలో  నాలుగో విడత పోలింగ్ కూడా  పూర్తయింది.. ఇప్పటికే మూడు విడతల్లో జరిగినా పోలింగ్ 70 శాతం దాటలేదు. ఈ క్రమంలో 4వ విడతలో 70 శాతం దాటించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈ  నేపథ్యంలో అన్ని పార్టీలు ఇప్పటికే ఒక అంచనాకు వస్తున్నాయి.  ప్రధానంగా ఎన్డీఏ కూటమి తమదే అధికారం అని అంచనా వేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపుపై ధీమాతో ఉంది.  ఏ రాష్ట్రం నుంచి ఎన్ని సీట్లు వస్తాయని లెక్కలు వేస్తోంది.  ఇప్పటికే జరిగిన మూడు విడతల పోలింగ్తో తమకు 200 సీట్లు ఖాయమయ్యాయని బీజేపీ చెబుతోంది.  ఇక కాంగ్రెస్ కూడా వందకుపైగా వస్తాయని అంచనా వేస్తోంది.కేంద్రంలో బీజేపీ నేతృత్వలోని ఎన్డీఏ కూటమి పదేళ్లు అధికారంలో ఉన్నందున సహజంగానే ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక అదే సమయంలో ఎన్డీఏ కూటమిలో అధిపత్యం కూటమిలోని కొన్ని పార్టీలకు రుచించడం లేదని భావిస్తోంది. ఎన్నికల తర్వాత ఇలాంటి పార్టీలు కూటమి నుంచి బయటకు వస్తాయని అంచనా వేస్తోంది. అదే జరిగితే తమకు మరింత మద్దతు లభిస్తుందని హస్తం నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్న జేడీఎస్, టీడీపీ, జేడీయూతోపాటు మరికొన్ని పార్టీలు బయటకు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. బీజేపీ అధిపత్యాన్ని నితీశ్కుమార్, చంద్రబాబునాయుడు, కుమారస్వామితోపాటు తటస్థంగా ఉన్న పార్టీలు కూడా సహించవని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ పార్టీలు కూటమి నుంచి బయటకు వచ్చి యూపీఏకు మద్దతు ఇస్తాయని అంచనా వేస్తుంన్నారు.ఇక బీజేపీతో ఉంటూ.. మరికొన్ని పార్టీలు కూడా ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏకు వెన్నుపోటు పొడుస్తారని కాంగ్రెస్ పార్టీ అంచనాలో ఉంది. ఇదే జరిగితే కేంద్రంలో ఇండియా కూటమి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటువుతుందని పేర్కొంటుంది. కాంగ్రెస్కు సొంతంగా 200 సీట్లు మిత్రపక్షాలు, కలిసి వచ్చే పార్టీలతో కలుపుకుని మరో వంద సీట్లు వస్తాయని భావిస్తోంది. మరి కాంగ్రెస్ అంచనాలే ఏమేరకు నిజమవుతాయో చూడాలి

Related Posts