‘డాన్సర్ అంకుల్’ సోషల్ మీడియాలో తన నృత్యాభినయంతో అందరినీ కట్టిపడేస్తున్న సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయిన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ప్రొఫెసర్ సంజయ్ శ్రీవాస్తవ్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో విదిశ మున్సిపాలిటీ సంజయ్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. దీనికిముందు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా సంజయ్ డాన్స్‌కు మెచ్చి ప్రత్యేక అభినందనలు తెలిపారు