YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆశల పల్లకీలో ముగ్గురు నేతలు

ఆశల పల్లకీలో ముగ్గురు నేతలు

హైదరాబాద్, మే 14
ఈ సారి సార్వత్రిక ఎన్నికలకు ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత లభించింది. మూడు ప్రధాన పార్టీల నేతలు హోరాహోరీగా తెలంగాణలో ప్రచారం సాగించారు. రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతలంతా దాదాపు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 16 రోజులపాటు బస్సు యాత్ర నిర్వహించారు. కాగా ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించలేదు. పార్లమెంట్ లో అధిక సీట్లు రాబట్టుకోవడం ద్వారా తమ సత్తా చాటాలని మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ ఎన్నికలను. కాగా ఒక్కో పార్టీ ఒక్కో నినాదంతో ఓటర్లను అభ్యర్థించడం విశేషం.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి జరిగే ఎన్నికలు ఇవి అంటూ రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో తమ ప్రత్యర్థులైన బీజేపీ, బీఆర్ఎస్ విధానాలను ఎండగడుతూ జాతీయ స్థాయిలోనూ ఒక్కసారిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో మోదీ అండ్ కో ను ఇరుకున పెట్టడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. రేవంత్ రెడ్డి దెబ్బతో బీజేపీ నేతలు నాలుకలు మడతపెట్టాల్సిన అగత్యం ఏర్పడిందని విమర్శకులు అంటున్నారు. . రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చొరవతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు దక్కి నేడు అనేక స్థాయిల్లోకి ఎదిగారు. కానీ రాజ్యాంగాన్ని మార్చేసి, రిజర్వేషన్లు లేని దేశంగా మార్చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండాను అమలు చేయాలని భావిస్తున్నది. ప్రపంచ దేశాలతో పోటీపడాల్సిన భారత్ ఇప్పుడు బీజేపీ కుట్రలకు బలి అవుతున్నది. అందుకే ప్రజలు వారి హక్కుల కోసం, దేశంలో ప్రజాస్వామ్యం కోసం ‘ఇండియా’ కూటమిని గెలిపించండి. తద్వారా కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచడానికి వీలు కలుగుతుంది” అని సీఎం రేవంత్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ సరిగ్గా ఓటర్లకు చేరితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మరోసారి రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందని రాజకీయ పండితులు చెబుతున్నారుబీజేపీ తరపున కిషన్ రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ గా అన్నీ తానై చూసుకున్నారు. తెలంగాణ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని అంటున్నారు. తెలంగాణకు బీజేపీ ఏమిచ్చింది? ఎన్ని పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి? మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తే తెలంగాణకు తాము ఏం చేస్తామో చెబుతూ ప్రచారాన్ని హోరెత్తించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు రావలసిన పెండింగ్ ప్రాజెక్టులన్నీ బీజేపీ ప్రభుత్వం మళ్లీ కేంద్రంలో వస్తే దక్కుతాయని..మోదీ పాలనతోనే దేశానికి రక్షణ అంటూ మూడో సారి మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో అన్ని రాష్ట్రాల పురోగతి బీజేపీతోనే సాధ్యం. మా పార్టీ దేశ అభివృద్ధి, రక్షణ, దేశ భవిష్యత్తుతో పాటు ప్రజల ఎదుగుదల కోసం అంకితభావంతో పనిచేస్తుంది. అవినీతి రహిత పాలనతో ఉగ్రవాదం లేని భారత్‌గా తీర్చిదిద్దుతుంది. ప్రపంచంలో భారత్ గౌరవాన్ని పెంచడానికి మోడీ నాయకత్వం అవసరం. పేదవారి ఇండ్లలో మరుగుదొడ్ల నిర్మాణం మొదలు దేశానికి అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించి చంద్రయాన్‌‌తో అంతర్జాతీయ స్థాయిలో సముచిత స్థానం దక్కింది. మాకు తెలంగాణలో ఈసారి డబుల్ డిజిట్ రావడం ఖాయం. ఇప్పటికే మేం సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉన్నాం అని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి ప్రచారంర నిర్వహించారు. అంతేకాదు అగ్ర నేతలైన మోదీ, అమిత్ షా వంటి నేతల ప్రసంగాలతో తెలంగాణలో తమకు అత్యధిక మెజారిటీ వస్తుందనే ధీమాను కల్పించారు.ఈ ఎన్నికల తర్వాత అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కొత్తగా మార్పులు వస్తాయంటూ ప్రచారం సాగించారు కేసీఆర్. అసెంబ్లీ ఓటమి భారం నుంచి కోలుకుని మళ్లీ బీఆర్ఎస్ క్యాడర్ ను ఉత్సాహపరుస్తూ 16 రోజుల బస్సు యాత్రను విజయవంతంగా పూర్తిచేశారు కేసీఆర్. రానున్న కాలంలో ప్రాంతీయ పార్టీలకే జనం పట్టం కడతారని, జాతీయ పార్టీలు మళ్లీ తమ ఉనికి కోల్పోవడం ఖాయం అంటున్నారు కేసీఆర్. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం. ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీ క్యూ కట్టయే పరిస్థితులు రాబోతున్నాయి. ఎన్నికల తర్వాత ప్రాంతీయ శక్తుల ఐక్యతను పెంచే ప్రయత్నం చేస్తా. తెలంగాణలో మాకు 12-14 సీట్లు వచ్చే అవకాశమున్నది. తొమ్మిదిచోట్ల కాంగ్రెస్‌కు థర్డ్ ప్లేస్. బీజేపీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నా మాకు చాలా దూరంగా ఉన్నది. తెలంగాణకు, కేసీఆర్‌కు మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉన్నది. పదవులను, రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడాను. ప్రజలకు కూడా ఇది తెలుసు. పదేండ్ల మా పాలనలో ప్రజలు అనుభవించిన ఫలాలు వారి కండ్ల ముందు ఉన్నాయికేంద్రంలో సంకీర్ణం తప్పదని…ఏ ఒక్క పార్టీకీ మెజారిటీ రాదంటూ అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కవ సంఖ్యలో గెలిస్తే కేంద్రంలో తమదే హవా అంటూ ప్రచారం కొనసాగించారు. అంతేకాదు రేవంత్ సర్కార్ ఎక్కవ కాలం ఉండదని జోస్యం చెబుతున్నారు.ఈ ఎన్నికలు మూడు పార్టీల కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మెజార్టీ సీట్లు సాధించి రేవంత్ తన సమర్ధత నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ సైతం ఇక్కడే గురి పెట్టింది. కేసీఆర్ అంచనాలు ఏ మేర నిజం అవుతాయనేది కీలకంగా మారుతోంది. మారుతున్న లెక్కలతో ఎన్నికలు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి. జనం అయితే ఓట్లేశారు. ఇక నేతల భవిత ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4 వరకూ ఫలితాల కోసం వేచి చూడాల్సిందే.

Related Posts