YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ కామెడీ పాలిటిక్స్

కేసీఆర్ కామెడీ పాలిటిక్స్

హైదరాబాద్, మే 14
ఉద్యమ సారథిగా, పదేళ్లు తెలంగాణను పాలించిన ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణలో మంచి గుర్తింపు ఉంది. ఇదే సమయంలో కుటుంబ పాలన, అహంకార పూరిత నిర్ణయాలు, మాటలు, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం తాము చేసిందే అభివృద్ధి అనే భావన.. చివరకు కేసీఆర్‌ సారథ్యంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీశాయి. పదవిలో ఉన్నప్పుడు తన వెనుక బలం, బలగం ఉన్నప్పుడు కేసీఆర్‌ ఏది చెప్పినా తలాడించారు. పదవి పోయాక కేసీఆర్‌ స్వరం మారిపోయింది. మరోవైపు పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది. ఈ సమంయలో కూడా కేసీఆర్‌ కామెడీ పాలిటిక్స్‌ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నరేంద్రమోదీతో పోల్చుకుని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు కేసీఆర్‌. గుజరాత్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన మోదీ.. తర్వాత దేశానికి ప్రధాని అయ్యారు. రెండు పర్యాయాలు సమర్థవంతంగా పనిచేశారు. ఆయనలాగానే తెలంగాణ మోడల్‌తో దేశ రాజకీయాల్లోకి రావాలని భావించారు. ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈమేర టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌ గా మార్చారు. పొత్తుల కోసం ప్రాంతీయ పార్టీల చుట్టూ తిరిగారు. కానీ కేసీఆర్‌ను ఎవరూ నమ్మలేదు. దీంతో సొంతంగా రాజకీయాలు చేస్తానని బీఆర్‌ఎస్‌ విస్తరణ చేపట్టారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లోని నేతలకు డబ్బులు ఇచ్చి బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికలకు ఆరు నెలల ముందు వచ్చిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ బొక్కబోర్లా పడింది. తెలంగాణ ప్రజలు ఓటుతో కొట్టిన దెబ్బకు కారు షెడ్డుకు పోయింది. ఈ క్రమంలో పార్టీలో ఇన్నాళ్లూ పదవులు అనుభవించిన నేతలు బీఆర్‌ఎస్‌ను వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది అధికార కాంగ్రెస్‌లో చేరారు. దీంతో పార్టీ ఉనికే ప్రశ్నార్థకమైంది. ఈ తరుణంలో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో పరువు కోపం పాకులాడుతున్నారు గులాబీ లీడర్లు. కనసీ స్థానాలు గెలవాలని చమటోడ్చారు. పార్టీ ఓడిపోయి.. ఉనికే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలోనూ కేసీఆర్‌కు ప్రధాని పదవిపై ఆశ తగ్గలేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అవసరమైతే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని, కుదిరితే ప్రధాని పదవి కూడా చేపడతానని ప్రకటించారు. ఇప్పుడు ఇదే అందరికీ కామెడీగా అనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారో చెప్పలేని స్థితిలో ఉన్న గులాబీ బాస్‌.. ఎన్నికల తర్వాత మాత్రం జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని అనడం, ప్రధాని అవుతానని వ్యాఖ్యానించడం చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఉట్టికి ఎగరలేనమ్మ.. ఆకాశానికి ఎగురుతానందట అన్న చందంగా కేసీఆర్‌ మాటలు ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్‌పై తెలంగాణ ప్రజలకు ఉన్న కోపం ఇంకా తగ్గలేదు. ఓడిపోయినా అహంకార పూరిత మాటలు మానడం లేదు. దీంతో కేసీఆర్‌ను ఇంకా గట్టిదెబ్బ కొట్టాలన్న భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఈ తరుణంలో పార్టీని కాపాడుకోవాల్సింది పోయి.. ప్రధాని అవుతాను.. చంక్రం తిప్పుతాను అని అనడం ద్వారా కేసీఆర్‌ తన స్థాయిని దిగజార్చుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో కారు స్టీరింగే తిప్పలేని కేసీఆర్‌.. జాతీయ రాజకీయాల్లో ఏం చక్రం తిప్పుతారు అని ప్రశ్నిస్తున్నారు.

Related Posts