విజయవాడ, మే 15,
ఏపీలో పోలింగ్ పూర్తయ్యాక, పోలింగ్ బూత్స్ దగ్గర పబ్లిక్ పల్స్ చూశాక తీరిగ్గా దిగాలు పడుతోందట. నెక్స్ట్ సిట్యువేషన్ ఏంటని, పబ్లిక్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందని క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్, ఇండస్ట్రీలో న్యూట్రల్ పీపుల్‌ను ఇంక్వయిరీ చెయ్యడం స్టార్ట్ చేసిందట. పొలిటికల్ పబ్లిసిటీకి పోయి ఆవిడ కెరీర్ రిస్క్ చేసుకుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఎవ్వరు ఉండరని పెద్దలు తరచూ చెప్పే మాట. ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద నిప్పులు చెరిగిన నటి రోజా, అనంతరం వైసీపీలో చేరి జగన్ విధేయురాలు అయ్యింది. ఒకప్పుడు చిరంజీవి ప్రజా రాజ్యంలో పని చేసిన పోసాని కృష్ణమురళి, ఇప్పుడు మెగా కుటుంబం మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక పార్టీ అధికారంలోకి రాకపోతే జెండా మార్చేసే రాజకీయ నాయకులకు దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కొదవ లేదు. ఇటువంటి ఉదాహరణలు రాజకీయాల్లో కోకొల్లలు. కాని ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితులు ఉండవు. ఇండస్ట్రీలో నలుగుర్నీ కలుపుకుపోవాలి కాని నలుగురి చూపుల్లో పడేలా లీడర్స్ మీద కామెంట్ చెయ్యడం తగదు. చిన్న చిన్న విమర్శలను కూడా సీరియస్‌గా తీసుకుంటారు. ఎందుకొచ్చిన గొడవ అని కామెంట్స్ చేసిన సెలబ్రిటీలను దూరం పెడతారు. ఏపీలో ఒక పార్టీకి మద్దతుగా పబ్లిసిటీ ప్రోగ్రామ్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసిన యాంకరమ్మ, ముసలి ముతక అంటూ ఇంటర్వ్యూల్లో పిట్టకథలు చెప్పింది. అది ఆవిడ కొంప ముంచేలా వుందని టాలీవుడ్ గుసగుస.ఏపీలో అధికార పగ్గాలు ఎవ్వరు చేపట్టినా ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాలు, కొన్ని వర్గాల ఆధిపత్యం ఉంటుంది. ఆయా కుటుంబాలకు కోపం వచ్చేలా యాంకర్ వ్యవహరించింది. దాంతో ఆవిడకు వెండితెర, బుల్లితెరపై కనిపించడం క్రమక్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని ఫిల్మ్ నగర్ ఖబర్. యాంకర్ సపోర్ట్ చేసిన పార్టీ పవర్‌లోకి వచ్చినా ఆవిడకు అవకాశాలు రావడం గగనమే అంటున్నారు. లాస్ట్ ఫైవ్ ఇయర్ అబ్జర్వ్ చేస్తే వైసీపీకి కొమ్ము కాసిన పోసాని యాక్ట్ చేసిన సినిమాలు ఎన్ని? స్టార్ హీరోల సినిమాల్లో అతడు కనిపించాడా? ఒకప్పుడు పవన్ కల్యాణ్ ప్రతి సినిమాలో ఉండే అలీ పరిస్థితి ఏమైంది? టీవీ షోలు, అడపాదడపా సినిమాలు చేసుకోవడం తప్ప భారీ సినిమాల్లో కనిపించడం లేదు. కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్లిద్దరి పరిస్థితి అలాగుంటే టాప్ రేంజికి కూడా రాని యాంకర్ పరిస్థితి ఊహించుకోవచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఏపీలో పోలింగ్ డే ఫైట్స్ యాంకరమ్మను ఆందోళనకు గురి చేశాయట. పబ్లిక్‌లో తన సపోర్ట్ చేసిన పార్టీ మీద ఇంత వ్యతిరేకత ఉందని ఊహించలేదని సదరు యాంకర్ క్లోజ్ సర్కిల్ దగ్గర చెబుతోందట. ఆ వ్యతిరేకత తన మీదకు రాకుండా ఉంటే అదే పది వేలు అని అనుకుంటోందట. సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ, ఈవెంట్స్ యాంకరింగ్ చేస్తూ బిజీగా వుంటున్న ఆ పెళ్లైన యాంకర్ నెక్స్ట్ స్టెప్ ఎలా వుంటుందో చూడాలి.