YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గెలుపుపై ధీమా... ఎవరి లెక్కలు వారివే

గెలుపుపై ధీమా... ఎవరి లెక్కలు వారివే

విజయవాడ,  మే 15,
ఆంధప్రదేశ్‌లో చెదురుమదురు సంఘటనల మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కొన్ని నియోజకరవర్గాల్లో అర్థరాత్రి వరకు పోలింగ్ జరిగింది గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ నమోదు అవుతున్నట్లు ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది.  మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల మినహా మిగతా చోట్ల పోలింగ్ అనుకున్నదానిపై ఎక్కువగానే నమోదైనట్టు ఓ అంచనా.మహిళలు, యువత ఈసారి ఎక్కువగా పోలింగ్‌లో పాల్గొన్నారని రాజకీయ పార్టీల అంచనా. గెలుపుపై నేతలు ఎవరి అంచనాల్లో వారు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా మహిళలు, యువత ఓట్లు తమకే లభిస్తుందని ఫ్యాన్ పార్టీ అంచనాల్లో నిమగ్నమైంది. ఎన్నికల ముందు వై నాట్ 175 స్లోగన్ ఇచ్చిన అధికార పార్టీ, పోలింగ్ తర్వాత 110 సీట్ల వస్తాయని అంచనా వేసింది. రిజల్ట్ తర్వాత ఎంత అన్నది చూడాలి. స్వతహాగా అధికార పార్టీ మాత్రం తామే గెలుస్తామని చెప్పడం సహజం. ఎన్నికల్లో కచ్చితంగా తామే గెలుస్తామని కుండబద్దలు కొట్టేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.వందకు పైగానే సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తంచేశారాయన. ఓటింగ్ శాతం పెరిగితే.. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని అంటారు. ఏపీలో ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందన్న సంకేతాల నేపథ్యంలో తనదైన శైలిలో జోస్యం చెప్పేశారు సజ్జల. ప్రభుత్వానికి సానుకూలత వల్లే ఓటింగ్ శాతం పెరుగుతోందని వివరించారు. ఇదే సజ్జల 2019 ఎన్నికల్లో మరోలా విశ్లేషించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లే ఓటింగ్ శాతం పెరిగిందని, తమ విజయం తమవైపేనన్నారు. ఆయన అంచనాల ప్రకారం చూస్తే ఇప్పుడు వైసీపీ గెలుస్తుందా అన్నదే అసలు ప్రశ్న.ఇక టీడీపీ విషయానికొద్దాం… ఓటింగ్ సరళి చూస్తుంటే అన్నివైపులా తమకే అనుకూలంగా ఉందని సైకిల్ పార్టీ నేతలు అంచనా. ముఖ్యంగా పట్టణ, సిటీ ఓటర్లు తమవైపు మొగ్గు చూపారన్నది నేతల విశ్లేషణ. ప్రతి దశలోనూ తమదే పైచేయి అని చెప్పుకొచ్చారు. కనీసం కూటమి 130 సీట్ల రావచ్చని లెక్కలు వేసుకుంటున్నారు. టీవీ ఛానెళ్ల విశ్లేషణకు వద్దాం. పోలింగ్ జరుగుతుండగా రెండు ఛానెళ్లు తమ తమ లెక్కలు బయటపెట్టాయి. ఒకరు వైసీపీకి వైపు మొగ్గు చూపగా, మరొకరు టీడీపీకి అనుకూలంగా చెప్పుకొచ్చాయి. ఆ ఛానెళ్ల గురించి అందరికీ తెల్సిందే. పార్టీలకు అనుగుణంగా అంచనాలు వేశాయని అంటున్నారు.సోషల్ ఇంజనీర్, రాజకీయ స్ట్రాటజిస్ట్ పీకే అలియాస్ ప్రశాంత్‌కిషోర్ గురించి అందరికీ తెల్సిందే. ఆయన పెద్దగా మీడియాతో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. ఎన్నికలకు రెండురోజుల ముందు తొలిసారి తెలుగు డిజిటల్ వెబ్ పోర్టర్ నిర్వహించిన డిబేట్‌లో క్లారిటీ ఇచ్చేశారు. ఆయన అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వస్తాయని చెబుతారు. జగన్ ఎక్కడైతే మొదలుపెట్టారో మళ్లీ అక్కడికే వస్తారన్నది ఆయన మాట. గతంలో వైసీపీకి వచ్చిన 151 సీట్లలో ప్రస్తుతం 51 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఇక ప్రధానంగా తటస్థ ఓటర్లపైనే అందరి దృష్టిపడింది. వాళ్లు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే గెలుపని కొంతమంది ఎనలిస్టులు చెబుతున్నమాట. ఓవరాల్‌గా చూస్తే ఈసారి ఎవరి గెలుస్తారన్నది ఎక్కడా క్లారిటీ లేదు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే.

Related Posts