YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తొలి బంగారు గని...

తొలి బంగారు గని...

కర్నూలు, మే 16
దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని ఆంధ్రప్రదేశ్ లో సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో బంగారు గనిని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. సుమారు 250 ఎకరాల భూసేకరణ చేపట్టి భూగర్భం నుంచి పసిడిని వెలికితీసేందుకు రూ. 200 కోట్ల పెట్టుబడితో భారీ ప్లాంట్ నిర్మిస్తోంది. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తవడంతో పైలట్ స్థాయిలో రోజుకు కిలో బంగారం ఉత్పత్తి చేస్తున్నట్లు సంస్థ ఎండీ హనుమ ప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలైతే ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం గనిలో కొద్దిరోజుల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు దాదాపు 60 శాతం పూర్తి కావడంతో నాలుగైదు నెలల్లో ఉత్పత్తి మొదలు కానున్నట్లు దక్కన్ గోల్డ్ మైన్స్ వెల్లడించింది.దీనికోసం ఇప్పటికే 250 ఎకరాలకు పైగా భూమిని సేకరించడం, ప్లాంట్ పనులు చేపట్టింది. ఏటా 750 కిలోల బంగారు ఉత్పత్తి చేయాలన్నది ఆ కంపెనీ అంచనా. ఇప్పటివరకు ఈ బంగారు గనిపై దాదాపు కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టింది. ఏపీలోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని పసిడి గనులను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీటిని తవ్వేందుకు ప్రభుత్వ రంగం సంస్థ ఎన్ఎండీసీ ముందుకొచ్చింది. వీటిని తమకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది కూడా.రాయలసీమలో బంగారం కోసం అన్వేషణ ఈనాటిది కాదు. బ్రిటీష్ పాలనకు ముందు మహమ్మదీయులు,  శ్రీకృష్టదేవరాయుల కాలంలో ఏపీలో మైనింగ్ జరిగినట్టు ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నాయి. అపారమైన ఖనిజ నిక్షేపాలు బంగారం, వజ్ర సంపద ఉన్న ప్రాంతంలో అశోకుడు ఆయన అధికారులు విడిది చేశారని అంటున్నారు. ఇందుకు సాక్ష్యం జొన్నగిరి సమీపంలో అశోకుని శిలాశాసనాలు ఉదాహరణగా చెబుతున్నారు. మొత్తానికి రాయలసీమ పసిడికి ఉత్పత్తికి వేదిక కానుందన్నమాట.బంగారం గనుల కోసం దేశంలో విపరీతమైన పోటీ నెలకొంది. రాజస్థాన్‌లో రెండు గనుల కోసం వేదంతా గ్రూప్, హిందుస్థాన్ జింక్, జిందాల్ పవర్ ఇందులో ఉన్నాయి. కంక్రియా గారా గోల్డ్ బ్లాక్, భూకియా-జగ్ పూరా బ్లాక్‌లను అక్కడి ప్రభుత్వం ఇప్పటికే వేలం నిర్వహిస్తోంది.దక్కన్ గోల్డ్ మైన్స్ కంపెనీ విషయానికొస్తే.. దేశంలో వివిధ ప్రాంతాల్లో గనులు నిర్వహిస్తోంది. ఈ సంస్ధ విదేశాల్లోనూ గనుల ప్రాజెక్టును చేపట్టింది. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని మొజాంబిక్‌లో లిథియమ్ గనులు కొనుగోలు చేసింది. దీన్ని అక్కడి మాగ్నిఫికా గ్రూప్‌తో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసింది. అందులో దక్కన్ గోల్డ్ మైన్స్‌కు 51 శాతం ఉండగా, దాన్ని 75 శాతానికి పెంచుకునేలా ప్లాన్ చేస్తోంది.రాజస్థాన్ రాష్ట్రంలోని కంక్రియా గారా గోల్డ్ బ్లాక్, భూకియా- జగ్ పురా గ్లోడ్ బ్లాక్ లను ఆ రాష్ట్ర ప్రభుత్వ గనుల శాఖ వేలం వేస్తోంది. అలాగే దక్కన్ గోల్డ్ మైన్స్ మన దేశంలో వివిధ ప్రాంతాల్లో బంగారం గనులు నిర్వహిస్తోంది. తాజాగా ఆఫ్రికాలోని మొజాంబిక్ లో లిథియమ్ గనులు కొనుగోలు చేసింది. దీని కోసం మాగ్నిఫికా గ్రూప్ ఆఫ్ మొజాంబిక్ తో కలిసి దక్కన్ గోల్డ్ మొజాంబిక్ ఎల్‌డీఏ అనే జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఇందులో దక్కన్ గోల్డ్ మైన్స్ కు 51 శాతం వాటా ఉండగా.. దానిని 70 శాతానికి పెంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ గనుల్లో రోజుకు 100 టన్నుల లిథియమ్, టాంటలమ్, ఇతర ఖనిజాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం గల ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.

Related Posts