తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పుట్టిన రోజు నేడు. ఆయన నేడు 45వ సంవత్సరం అడుగుపెట్టారు. అభిమానులు, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వేద మంత్రాలతో పండితులు హరీశ్‌రావును ఆశీర్వదించారు. అభిమానుల కోలాహలం మధ్య భారీ కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పలువురు నేతలు మంత్రికి శుభాకాంక్షలు చెప్పారు.