YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మారిపోయిన వాతావరణం తడిసి ముద్దైన వరిధాన్యం

మారిపోయిన వాతావరణం తడిసి ముద్దైన వరిధాన్యం

హైదరాబాద్, మే 16
వరిధాన్యం కొనుగోళ్లలో జాప్యం సాగుతుంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వరిధాన్యం తడిసి ముద్దైంది. అంతేకాకుండా తేమ శాతం కూడా పెరిగింది. అయినప్పటికీ ధాన్యం కొనుగోళ్లులో జాప్యం చేస్తున్నారు అధికారులు. దీంతో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. తేమ శాతంతో సంబంధం లేకుండా.. వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలు కురిశాయి. దీంతో ఐకెపి కేంద్రాల వద్ద వరిధాన్యం తడిసి ముద్దైంది. ఇప్పటికీ కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. అంతేకాకుండా తేమ శాతం పెరిగిపోయింది. దీంతో తేమ శాతం ఆధారంగానే ధాన్యాన్ని కొనుగోళ్లు చేస్తున్నారు. అయితే.. తడిసిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోనరావు పేట మండలం మల్కాపేట గ్రామంలో రైతులు ఆందోళన చేశారు. తడిసిన పరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.20 రోజుల క్రితం ధాన్యాన్ని తీసుకొచ్చినా కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్కెక్కారు. అదే విధంగా పరిధాన్యం తడిసిపోవడంతో తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకొని కొనుగోలు చేస్తున్నారు. ఇంకా 20 శాతం వరకు కొనుగోలు చేయలేదు. ఇప్పుడు నాతవరణం కూడా మారిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాలు రానున్నాయి. ఖరీఫ్ సీజన్ కూడా ఆరంభంకానుంది. వెంటనే.. పరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల వరిధాన్యం కొనుగోలు చేసినా.. సకాలంలో డబ్బులు రావడం లేదు. ఈ నాలుగైదు రోజుల్లో వరిధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. అధికారులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందవద్దని రైతులకు సూచిస్తున్నారు. పూర్తి స్థాయిలో పరిధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇస్తున్నారు. అయితే ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సకాలంలో వరిధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. అకాల వర్షాల కారణంగా వరిధాన్యం తడిసిపోయిందని రైతులు చెబుతున్నారు. తేను శాతం పేరుతో సరిగా కొనుగోలు చేయడం లేదని అంటున్నారు. వెంటనే పరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.మార్కెట్ యార్డులో ధాన్యం కుప్పలపై కవర్లు కప్పి ఉంచినప్పటికీ భారీ వర్షం ధాటికి పలువురు రైతుల ధాన్యం కొట్టుకు పోవడంతో కాపాడుకునేందుకు రైతులు వర్షంలోనే అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. వారసంతలో చిరువ్యాపారులు వాన ధాటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.కుభీరు మండలంలోని సిర్పెల్లి తండా, గొడిసెర్చ్, తదితర గ్రామాల్లో  ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసింది. కోసి ఆరబెట్టిన మొక్కజొన్న, నువ్వు పంటలు తడిసి ముద్దయ్యాయి. సిర్పెల్లి తండాలో విద్యుత్తు ట్రాన్స్ఫర్మర్ గద్దె పై నుంచి పడిపోయింది పలుచోట్ల స్తంభాలు వంగిపోయి విద్యుత్తు సరఫ రాకు అంతరాయం ఏర్పడింది.

Related Posts