YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డీబీటీ పథకాల నిధుల విడుదల

డీబీటీ పథకాల నిధుల విడుదల

విజయవాడ, మే 16
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు రాజకీయ దుమారానికి కారణమైన డీబీటీ పథకాల నిధుల విడుదల ప్రారంభమైంది. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ప్రభుత్వం ఇచ్చింది. బుధవారం నుంచి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు పేర్కొంది. బుధవారం ఒక్కరోజే లబ్ధిదారుల ఖాత్లాలో నిధులు జమ చేశామని ప్రభుత్వం వెల్లడించింది. ఆసరా పథకం కింద 1480 కోట్ల రూపాయలు విద్యాదీవెన కింద 502 కోట్లు విడుదల చేశారు. అన్ని పథకాలకు త్వరలోనే పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం  పేర్కొంది. రెండు మూడు రోజుల్లో అన్ని పథకాలకు నిధుల విడుదల పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. జనవరి నుంచి వివిధ పథకాలకు ఇవ్వాల్సిన నిధులను ప్రభుత్వం పోలింగ్‌కు రెండు రోజుల ముందు విడుదల చేయాలని ప్రయత్నించింది. దీనిపై ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పింది. ఇలా నిధులు విడుదల చేస్తే కచ్చితంగా ఎన్నికలపై ప్రభావం చూపినట్టు అవుతుందని అభిప్రాయపడిందని పేర్కొంది. ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ సానుభూతిపరులు, పథకాల లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఒక్కరోజు సమయం ఇచ్చి లబ్ధిదారుల ఖాతాల్లో  నగదు వేయాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా ప్రచార ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. నాయకులు కూడా దీనిపై ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ఆదేశించింది. దీనిపై కూడా ఎన్నికల సంఘం అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఇన్ని రోజుల నుంచి ఇవ్వకుండా ఇప్పుడే ఇవ్వడానికి కారణాలు చెప్పాలని, అసలు అంత డబ్బులు ఇప్పుడు ఎక్కడ సర్దుబాటు చేస్తున్నారని ప్రశ్నించింది. ఎన్నికల సంఘం అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పోలింగ్‌కు ముందు రోజు పడాల్సిన నిధులు ఖాతాల్లో జమ కాకుండా పోయాయి. అయితే కోర్టులో వాదన సందర్భంగా పోలింగ్ తర్వాత రోజు నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో పోలింగ్ ముగియడంతో నిధుల పంపిణీ మొదలైంది.

Related Posts