YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

550 కాంతి సంవ‌త్స‌రాల దూరంలో త్రిన‌క్ష‌త్ర కూట‌మి.. ఫోటో రిలీజ్ చేసిన నాసా

550 కాంతి సంవ‌త్స‌రాల దూరంలో త్రిన‌క్ష‌త్ర కూట‌మి..  ఫోటో రిలీజ్ చేసిన నాసా

న్యూయార్క్‌ మే 16
హ‌బుల్ టెలిస్కోప్‌కు ఆకాశ అద్భుతం చిక్కింది. విర‌జిమ్ముతున్న నెబులా నుంచి త్రి న‌క్ష‌త్ర కూట‌మి ఉద్భ‌వించింది. ఆ హెచ్‌పీ టావూ ఫ్యామిలీలో ఓ యువ న‌క్ష‌త్రం కూడా ఉన్న‌ట్లు నాసా పేర్కొన్న‌ది. సుమారు 550 కాంతి సంవ‌త్స‌రాల దూరంలో ఆ న‌క్ష‌త్రం జ‌న్మించిన‌ట్లు నాసా వెల్ల‌డించింది. హెచ్‌పీ టావూ న‌క్ష‌త్ర కుటుంబంలో హెచ్‌పీ టావూ, హెచ్‌పీ టావూ జీ2, హెచ్‌పీ టావూ జీ3 న‌క్ష‌త్రాలు ఉన్నాయి. ఈ మూడింటిలో మిళ‌మిళ‌లాడుతున్న హెచ్‌పీ టావూ చాలా చిన్న వ‌య‌సున్న న‌క్ష‌త్రం. సూర్యుడి త‌ర‌హాలో ఉద్భ‌విస్తున్న ఈ న‌క్షత్రం వ‌య‌సు 10 మిలియ‌న్ల సంవ‌త్స‌రాలు ఉంటుంద‌ని నాసా శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. మ‌న‌ సూర్యుడి సుమారు 4.6 బిలియ‌న్ల ఏళ్ల క్రితం పుట్టిన విష‌యం తెలిసిందే.

Related Posts