YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు పొత్తుపై స్పష్టత ఇవ్వాలి..

చంద్రబాబు పొత్తుపై స్పష్టత ఇవ్వాలి..

- అమిత్‌షాకు లేఖ - పురందేశ్వరి

బీజేపీతో పొత్తులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి స్పందించారు. బీజేపీ తమతో పొత్తు వద్దనుకుంటే...నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని చంద్రబాబు అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన పురందేశ్వరి బీజేపీతో పొత్తు కొనసాగిస్తారో...కొనసాగించరో టీడీపీనే తేల్చుకోవాలని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను బీజేపీ అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. టీడీపీకి బీజేపీతో పొత్తు కొనసాగించాలనే ఉద్దేశం లేకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబుతో మాట్లాడాలని ఆమె సూచించారు. అలాగే ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకోవాలంటూ.. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాసినట్లు పురందేశ్వరి తెలిపారు. 

బిజెపిపై చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు

బిజెపి వాళ్ళు తమతో పొత్తు వద్దనుకుంటే నమస్కారం పెట్టి బయటకు వస్తామని అన్నారు. గతంలోనూ పోలవరం విషయంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి వీటిని పునరుద్ఘాటించటంతో రాజకీయంలో ఏదో తేడా కొడుతుందనే విషయం తెలిసిపోతోంది. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  ‘నేను మా వాళ్లను కంట్రోల్‌ చేస్తున్నా.. మిత్రధర్మం వల్ల ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. బీజేపీ నాయకులు టీడీపీపై చేస్తున్న విమర్శలపై బీజేపీ అధిష్టానం ఆలోచించుకోవాలి’ అన్నారు. పార్టీ ఫిరాయించి మంత్రులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బీజేపీని రాష్ట్రంలో నామరూపం లేకుండా చేయాలని టీడీపీ చూస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపణలు చేశారు. ఈ అంశాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపే అవకాశం ఉంది. అయితే వీటిపై బిజెపి నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Related Posts