ముంబై, మే 17,
బంగారం ధరలు మళ్లీ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. గత కొన్ని రోజులుగా కాస్త శాంతించినట్లు కనిపించినా గోల్డ్ రేట్స్ ఇప్పుడు మళ్లీ ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. తాజాగా బంగారం సరికొత్త మార్కును దాటేసింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 74 వేల మార్కును దాటేసింది. దీంతో ఈ ఏడాది చివరి నాటికి రూ. 80 వేల మార్కును చేరుకోనుందన్న నిపుణుల వాదనకు బలం చేకూర్చినట్లవుతోంది. మరి దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68010గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74180 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67860గా ఉంగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74030 వద్ద కొనసాగుతోంది.
* ఇక బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,860గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74030గా ఉంది.
* కేరళలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,860 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74030 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,860కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74030 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలోనూ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,860కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74030 వద్ద కొనసాగుతోంది.
* సాగర నగరం విశాఖలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,860కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74030 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి కూడా బంగారం దారిలోనే నడుస్తోంది. వెండి ధరల్లోనూ పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై రూ. 100 వరకు పెరిగి రూ. 89,200కి చేరింది. ఇక ఢిల్లీలో తోపాటు ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 89,200 వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నైతో పాటు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 92,600 వద్ద కొనసాగుతోంది.