YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మెదక్ లో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం... ఎవరికి నష్టం

మెదక్ లో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం... ఎవరికి నష్టం

మెదక్, మే 17 
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే ఉంది. అక్కడ టికెట్ ఎవరికి ఇస్తారు.. బరిలో ఎవరు నిలుస్తారు.. ఇలా చాలా చర్చ జరిగింది. పోలింగ్ ముగిసింది.. ఇక ఇప్పుడు ఆ పార్లమెంట్ స్థానంలో ఏపార్టీ జెండా ఎగరేస్తుంది? ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? ఇలా కొత్త చర్చ జరుగుతోంది. ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎంతోమందిని ఆకర్షించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో తాజాగా ఇప్పుడు గెలిచేది ఎవరు అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. మెదక్ పార్లమెంటుపై ఇంత చర్చ జరగడానికి కారణం గతంలో ఇక్కడ రాజకీయ ఉద్దండులు ఎంపీ బరిలో నిలిచి దేశ రాజకీయాలను మర్చారు. మెదక్ పార్లమెంట్ అంటేనే ఒక మినీ ఇండియా. వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడి నుండి ఇందిరా గాంధీ ఎంపీగా పోటీ చేసి దేశ ప్రధాని కూడా అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడి నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అందుకే ఈ స్థానానికి అంతటి క్రేజ్. మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఈ మెదక్ పార్లమెంట్ నుండి బీఆర్ఎస్ నుండి వెంకట్ రాం రెడ్డి.. కాంగ్రెస్ నుండి నీలం మధు.. బీజేపీ నుండి రఘునందన్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురు కూడా ఎన్నికల్లో గెలవడానికి తీవ్రంగా కృషి చేసారు. ఆయా పార్టీల జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు కూడా వారి అభ్యర్థుల గెలుపుకోసం జోరుగా ప్రచారం నిర్వహించారు. ఎలాగైనా సరే మెదక్ పార్లమెంట్‎పై జెండా పాతలని కసితో పనిచేశాయి మూడు ప్రధాన పార్టీలు. అందుకే చివరికి వరకు ఇక్కడ త్రిముఖ పోరే కొనసాగిందిదీనికి తోడు ఈసారి పోలింగ్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగి.. 75.90 పోలింగ్ నమోదు అయ్యింది. గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ పర్సంటేజ్‎తో చుస్తే ఈసారి 3.38 శాతం పెరిగింది. పెరిగిన పోలింగ్ ఎవరికి ప్లస్ అవుతుంది. ఈ త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారు అనే దాని పై బెట్టింగ్‎లు కూడా జోరుగా నడుస్తున్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా అందులో ఆరు స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒక మెదక్ అసెంబ్లీ మాత్రం కాంగ్రెస్ దక్కించుకుంది. మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఇక్కడ నల్లేరు మీద నడకే అనే ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్, బీజేపీ కూడా ఈ సీట్‎ను చాలా సీరియస్ గానే తీసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెదక్ సీట్ దక్కించుకోవాలని కసిగా పనిచేసింది. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రఘునందన్ మెదక్ ఎంపీగా గెలవాలని గట్టిగా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్ పార్లమెంట్ స్థానంను దక్కించుకివడానికి కాంగ్రెస్, బీజేపి పార్టీలు బాగానే కృషి చేసాయి. అంతే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహాలు చేస్తూ ముందుకు సాగింది.బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం మాజీ మంత్రి హరీష్ రావు అన్ని తానై ప్రచారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ పార్లమెంటు పరిధిలో తన బస్సు యాత్రను నాలుగు నియోజకవర్గాల్ల కవర్ అయ్యేలా ప్లాన్ చేసి, ప్రచారం నిర్వహించారు. ఇక మెదక్ పార్లమెంట్ పరిధిలో కీలకమైన నియోజకవర్గం సిద్దిపేట నియోజకవర్గం. ఇక్కడి ప్రజలు ఏ పార్టీ వైపు నిలిచారు.? అనే చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్న నాటి నుంచి మెదక్ పార్లమెంట్‎కు జరిగిన ఎన్నికల ఫలితాలను గమనిస్తే సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు తీర్పే కీలకంగా ఉంటుంది. సిద్దిపేట ప్రజలు ఏ పార్టీ వైపు నిలిస్తే ఆ పార్టీ గెలుపొందడం విశేషం. ఆ సెంటిమెంట్ దృష్ట్యా తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కేసీఆర్ చివరి సభను ఇక్కడే ఏర్పాటు చేశారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు నిలిచారన్న ఆంశంపై జోరుగా బెట్టింగ్‎లు సాగుతున్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట నియోజక వర్గంలో 2,37,591 మంది ఓటర్లకు గాను 1,74,969 (73.64శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 2,00,125 మంది ఓటర్లకు గాను 1,64,952(82.42 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Related Posts