YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

టీమిండియా కోచ్ కు పోటా పోటీ

టీమిండియా కోచ్ కు  పోటా పోటీ

ముంబై, మే 17
టీమిండియా కోచ్ పదవికి పలువురు సీనియర్ క్రికెటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బీసీసీఐ మదిలో ఏముందో ఎవరికి తెలియడం లేదు. ఎవరికి చెవిలో చెప్పి, అప్లై చేయమని సలహాలిస్తున్నారో కూడా తెలీడం లేదు. అయితే చాలామంది అనుకునేదేమిటంటే.. డైరెక్టుగా బీసీసీఐ నుంచి అనధికారికంగా అయినా ఫోను వస్తే, అప్పుడు చూద్దామనే లెక్కలో కొందరు ఉన్నారని అంటున్నారు
.వివివిఎస్ లక్ష్మణ్ కి ఆసక్తి ఉందా? లేదా?
ప్రస్తుతం లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ  డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అద్భుత‌మైన బ్యాటింగ్ క్రికెట్ ప్ర‌పంచంలో త‌న‌దైన ముద్ర‌వేసిన అత‌ను ద్రవిడ్ తర్వాత టీమిండియాకు ప్ర‌ధాన కోచ్ బహుశా లక్ష్మణ్ కావచ్చునని అంటున్నారు. ద్రవిడ్ సెలవులో ఉన్నప్పుడు లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశాడు.
జస్టిన్ లాంగర్ అయితే బెటర్?
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్. అలాగే 2023 వన్డే వరల్డ్ కప్ ఆస్ట్రేలియా సాధించడంలో కోచ్ గా తన పాత్ర ఎంతో కీలకంగా ఉంది. అంతేకాదు ఆస్ట్రేలియా పలు విజయాల్లో జస్టిన్ లాంగర్ పాత్ర ఉంది. గతంలో విదేశీ కోచ్ లు ఉన్నప్పుడే మనవాళ్లు ఐసీపీ ట్రోఫీలు గెలిచారు. అందుకని ఈసారి విదేశీ కోచ్ లని తీసుకోవాలని అనుకుంటే మాత్రం జస్టిన్ లాంగర్ బెటర్ ఛాయిస్ అని అంటున్నారు.
చెన్నై కోచ్.. స్టీఫెన్ ఫ్లెమింగ్
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ అయిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ గా ఉన్నాడు. ధోనీతో మంచి కెమిస్ట్రీ ఉండటంతో చెన్నయ్ ని తొమ్మిదిసార్లు ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. అంతేకాదు ఐదుసార్లు ట్రోఫీ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తన ప్లానింగ్, ఆలోచనలు, వ్యూహాలు కలిసి రావడం వల్లే చెన్నయ్ ఇప్పుడు కూడా ప్లే ఆఫ్ రేస్ లోనే ఉండటం విశేషం. అయితే మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఫ్లెమింగ్ పేరుని బీసీసీఐకి రికమండ్ చేశాడనే టాక్ ఒకటి నెట్టింట వినిపిస్తోంది.
ఫైర్ బ్రాండ్ గౌతమ్ గంభీర్
గొప్ప క్రికెట్ బుర్రగా అందరూ కొనియాడే గౌతమ్ గంభీర్ కూడా భారత హెడ్ కోచ్ రేస్ లో ఉన్నాడు. కాకపోతే నోటి దురద బాగా ఎక్కువ. చిన్నా పెద్దా చూసుకోడు. ముందూ వెనుకా చూసుకోడు. మంచీ చెడ్డా చూసుకోడు. తనకి ఆ క్షణం ఏదనిపిస్తే అది అనేస్తాడు. తర్వాత ఎంత రచ్చయినా పోరాడతాడు తప్ప వెనుకడుగు వేయడు. అలాంటి మొండి ఘటం కోచ్ గా కరెక్టేనా? అంటున్నారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మతో మంచి అనుబందం ఉంది. కొహ్లీతో గొడవలున్నా సర్దుకున్నారు. కోల్ కతా కెప్టెన్ గా ఉండి రెండుసార్లు ట్రోఫీ అందించాడు. ప్రస్తుతం మెంటార్ గా ఉండి ప్లే ఆఫ్ కి తీసుకువెళ్లాడు.
ఫాస్ట్ బౌలర్.. ఆశిష్ నెహ్రా
ఇండియన్ క్రికెట్ లో ఒకనాటి ఫాస్ట్ బౌలర్లలో ఆశిష్ నెహ్రా కూడా ఒకడు. అయితే సౌమ్యుడు, వివాదాలకు దూరంగా ఉంటాడు. ఒకసారి మహేంద్ర సింగ్ ధోనీ తనని బూతులు తిట్టాడని అన్నాడు. కాకపోతే ఇలా అంతర్గత వ్యవహారాలని ఎప్పుడైనా బయటపట్టే మనస్తత్వం ఉన్నవాళ్లని కోచ్ గా తీసుకోరని అంటారు. ఎందుకంటే భవిష్యత్తులో భారత్ క్రికెట్ బొక్కలన్నీ బయటకి వస్తే ప్రమాదమని భావిస్తే, నెహ్రాకి అవకాశం ఉండకపోవచ్చు. ప్రస్తుతం గుజరాత్ హెడ్ కోచ్ గా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ కి ట్రోఫీ అందించడమే కాదు, ఒకసారి ఫైనల్ కి కూడా తీసుకువెళ్లాడు.
వీరే కాకుండా ఢిల్లీ కోచ్ గా ఉన్న రికీ పాంటింగ్ పేరు కూడా బీసీసీఐ లిస్టులో ఉందని అంటున్నారు. మరి ఎవరికి అవకాశం వస్తుందో ఎదురుచూడాల్సిందే.

Related Posts