దగ్గుబాటి రానా కళ్లకు శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. తాను ఒక కంటితో మాత్రమే చూడగలుగుతానని రానా ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రెండో కన్నుకు రానా చికిత్స చేయించుకోనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. రెండో కన్నుతో ఆయన చాలా ఇబ్బందికి గురవుతున్నారట. నొప్పి తీవ్రంగా ఉండడంతో చికిత్స చేయించుకోవాలని అనుకుంటున్నారు. శస్త్ర చికిత్స విదేశాల్లోనే జరుగుతుందని రానా తండ్రి, ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు మీడియా ద్వారా వెల్లడించారు.