విజయవాడ
మహిళల ఓటింగ్ పెరగడం తమకే లాభం అని కూటమి పార్టీ నేతలు భావిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం హామీ తమకు ఫలించిందని నమ్మకంతో ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలుకు జనం జేజేలు పలికారని విశ్వాసం వ్యక్తం చేస్తూ అందుకే అన్ని వర్గాల వారూ మూకుమ్మడిగా వచ్చి ఓటు వేశారన్నది కూటమి నేతలమాట. మరోవైపు ఓటింగ్ శాతం పెరుగుదల ప్రభుత్వవ్యతిరేకతే అని టిడిపి చెబుతూ వ్యతిరేక ఓటు అంతా తమకే లాభమని చెపుతోంది. ఇక హైదరాబాద్ నుంచి వచ్చిన లక్షలాది జనం కూడా కూటమికి మద్దతివ్వడానికే వచ్చారన్నది వారి నమ్మకంగా కనిపిస్తోంది.
చంద్రబాబు అరెస్టు సందర్భంగా హైదరాబాద్ లో ర్యాలీలు., మీటింగులు పెట్టిన యువకులు., సాఫ్ట్ వేర్ సిబ్బంది, యువకులు అంతా కూడా చంద్రబాబు రావాలన్న కోరికతో వచ్చారని చెబుతున్నారు. అంతే కాకుండా హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ అభిమానులు తమ సొంత వాహనాల్లో స్వచ్చందంగా వచ్చి ఓటు వేసి వెళ్లారని అనకుంటున్నారు. అలాగే ఎన్ ఆర్ ఐ ఓట్లు కూడా తమకే లాభిస్తాయని టిడిపి ఆశతో ఉంది.