తిరుపతి
వైకాపా నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా అరాచక ప్రదేశ్ లోనా. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిని మారణాయుధాలతో చంపాలని చూస్తారా అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. జనం ఓటు వేయకపోతే దాడులు చేస్తారా. కొందరు అధికారుల అండతో అధికార పార్టీ నేతలు దాడులు చేయడం తగునా . పోలీసుల వైఫల్యం వల్లే దాడులు జరుగుతున్నాయి. వైకాపా నేతల మాటలు నమ్మి అధికారుల కెరీర్ నాశనమైంది. శాంతి భద్రతలు ఎలా అమలు చేయాలో యూపీ సిఎం యోగీని చూచి నేర్చుకోమని జగన్మోహన్ రెడ్డికి సూచించారు. ఏపీలో తాజాగా జరుగుతున్న ఆగడాలకు కర్త, కర్మ, క్రియ ఎవరో తేల్చాలని డిమాండ్ చేసారు. వైకాపా నేతల నేరాలపై మీడియా ముందు భాను ప్రకాష్ రెడ్డి సుత్తి, రాళ్లు, నకిలీ పెట్రోల్ బాంబులను తీసుకొచ్చి ప్రజలకు అవగాహన కల్పించారు.