YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనేక అక్రమాలకు పాల్పడ్డ జోగి రమేష్

అనేక అక్రమాలకు పాల్పడ్డ జోగి రమేష్

పెనమలూరు
పెనమలూరు లో  మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. జోగి రమేష్ ను అభ్యర్థిగా ప్రకటించిప్పటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటే అతని కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చింది. రెవిన్యూ అధికారులతో పాటు ఉయ్యురు సీఐ, కంకిపాడు, పెనమలూరు స్టేషన్లో ఎస్ఐలను కూడా పెడన నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకుని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారు.వైసీపీ నాయకులు ఎన్ని విధాలుగా మభ్యపెట్టాలని చూసిన టీడీపీ నాయకులు నిలబడ్డారు.నాకు సీట్ కేటాయిస్తే ఆయన బాణాసంచులు, మిఠాయిలు పంచారు. ఆయన మతి స్టిమితం బ్రమించింది మైలవరం, పెడన, పటమట నుంచి రౌడీ షీటర్లను దింపి హడావిడి చేశారు..బట్ట అనిల్, కొత్తపల్లి రాజేష్,నరగాని అశ్విన్ అనే రౌడీ షీటర్ల పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు.
పెనమలూరు స్టేషన్ లో సీఐ, సిబ్బంది అందరూ విఫలమయ్యారు. పోరంకి టీడీపీకి కంచుకోట.పోరంకిలో కావాలనే గంట పాటు పోలింగ్ నిలిపివేసి ప్రజలను భయాందోళనకు గురి చేశారు.200 మీటర్ల దూరంలో ఉండాల్సిన వ్యక్తులను పోలింగ్ కేంద్రం గేట్ ముందు నిలబడ్డారు.దీన్ని పోలీసులు దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదు.మా మీద 3 కేసులు పెట్టారు. జోగి రమేష్ నేరుగా అల్లర్లుకు పాల్పడితే అతనిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. జోగి రమేష్ వలస పక్షి, ఎన్నికల ఫలితాలు తరువాత అడ్రస్ ఉండడు.జోగి రమేష్ ని చూసుకుని  టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వ్యక్తులకు వడ్డీతో సహా చెల్లిస్తాం..జోగి రమేష్ పోరంకిని స్వాధీనం పరుచుకున్న అని  వీర్రావిగుతున్నారు. ఇది ఏమైనా రాజుల రాజ్యమా.. ప్రజా స్వామ్యంలో స్వాధీనం చేసుకోవడం ఏంటి..నా వెంట్రుక కూడా పీకలేరు..నీ తరం కాదు నీ అబ్బా తరం కాదు.నేను ఏనాడూ జోగి రమేష్ మీద నోరు జారలేదు.జోగి రమేష్ కు ఎక్సపీరి డేట్ దెగ్గర  పడింది.జూన్ 4 తర్వాత  గేమ్ మొదలవుతుంది.మా కార్యకర్తలను అదుపులో ఉంచుకున్నాం కాబట్టే జోగి రమేష్ పోరంకి దాటి వెళ్లారు. పెనమలూరు సీఐ పూర్తిగా విఫలం అయ్యారు.ఇతనిపై ఫిర్యాదు చేస్తాం ..20 ఏళ్ళ చరిత్రలో పెనమలూరు నియోజకవర్గంలో ఏనాడూ ఘర్షణలు జరగలేదు.ఓటమి నుంచి తప్పించుకోలేరు.కానూరు లో ఉండే కమ్మ కార్పొరేషన్ చైర్మన్ దేవభక్తుని చక్రవర్తి టీడీపీ కార్యకర్తలకు  వాట్సాప్ కాల్ చేసి బెదిరిస్తున్నారు.కులాల పేరుతో నియోజకవర్గంలో అల్లర్లు చేసే ప్రయత్నం చేశారు.జోగి రమేష్ బంధువులు కూడా టీడీపీకే ఓటు వేశారు.కానూరు కెనడి స్కూల్ లో పడవల కృష్ణ మూర్తి అనే వ్యక్తి ఓటు వేసేందుకు క్యూ లైన్లో నిలబడిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.పోలింగ్ ముగిసిన తర్వాత ఎస్పీ వచ్చి అంత ప్రశాంతంగా ఉందని ప్రకటించారు.టీడీపీ కూటమి 100 శాతం అధికారం చేపడుతుందని అన్నారు.

Related Posts