YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జిందాల్ సంస్థ మూసివేత

జిందాల్ సంస్థ మూసివేత

విజయనగరం
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్న దర్పణం జిందాల్ స్టీన్లెస్ స్టీల్ లిమిటెడ్ కర్మాగారం శుక్రవారం మొదటి షిఫ్ట్  నుండి తాత్కాలికంగా లాకౌట్ ప్రకటించారు.  విధుల్లోకి హాజరవుతున్న కార్మికులు ఒకసారిగా షాక్ గురయ్యారు.  గత పది రోజులుగా కంపెనీకి రా మెటీరియల్ రాకపోవడం వల్ల కంపెనీ నష్టాలు భరిస్తూ శుక్రవారం తెల్లవారుజామున మొదటి షిఫ్ట్ నుండి తాత్కాలికి లాకుడు ప్రకటించినట్లు యాజమాన్యం తెలుపుతుంది. అయితే కార్మికులకు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా అక్రమ లాకోటి ప్రకటించడంపై కార్మికులు దుమ్మెత్తు పోస్తున్నారు.  గతంలోనూ  ఈ పందాలోనే అక్రమ లాకౌట్లు  విధించిందని ప్రస్తుతం ఎటువంటి ముందస్తు చర్యలు తెలుపుకుంటా లాకౌట్ ప్రకటిస్తే కార్మికులంతా ఏమవుతారని ప్రశ్నిస్తున్నారు.  జిందాల్ కర్మాగార టాప్ యాజమాన్యం తీరు మారలేదని కర్మాగారం నడప లేక పోతే తమకు సెటిల్మెంట్లు చేయాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.  కర్మాగారం  మూసివేస్తే తమ గతి ఏంటని కార్మికులు రోడ్డుపై గేటు పై బైఠాయించారు.  పరిస్థితి చక్కదిద్దేందుకు కొత్తవలస సీఐ ప్రత్యేక బలగాలను రప్పించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఏర్పాటు చేశారు. కర్మాగార ఐ ఎన్ టి యు సి టి ఎన్ టి యు సి సి ఐ టి యు మూడు యూనియన్ల నాయకులు చర్చలు జరపాలని కర్మాగారం తెరిపించాలని డిమాండ్ చేశారు.  రా మెటీరియల్ కొరత, విద్యుత్ ఛార్జీలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ నుంచి చౌకగా ఫెర్రో క్రోమో దిగుమతి అవడం, కర్మాగారంలో తయారవుతున్న ఫిరో క్రోమ్ కి ధర తగ్గిపోవడం వంటి కారణాలవల్ల తాత్కాలికంగా కర్మాగారం లాకౌట్  పట్టించినట్లు మేనేజరు దినేష్ శర్మ తెలిపారు.
మెటీరియల్ అందుబాటులోకి రాగానే తిరిగి కంపెనీ తెరుస్తామని కార్మికులు ఆందోళన చెందొద్దని కంపెనీ హెచ్ఆర్ గోపాలకృష్ణ తెలిపారు.

Related Posts