లక్నో మే 17
ఎన్నికల్లో దేశం కోసం పనిచేసే ఎన్డీఏ, దేశంలో అస్థిరతను పెంచే ఇండియా కూటమి మధ్య పోరు జరుగుతోందని ప్రధాని మోడీ అన్నారు. దేశ ప్రజలు బీజేపీవైపే ఉన్నారని.. ఏన్డీఏ విజయం ఖాయమని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాన మోడీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. . మా ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతుందన్నారు. గెలిచినత పేదల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకోబోతున్నామని చెప్పారు. మీ ఓటు వల్లే రామమందిరం నిర్మాణం జరిగిందన్నారు. బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే రామమందిరం సాధ్యమైందని ప్రధాని అన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే.. వాళ్లు మోడీని తిట్టడమే పనిగా పెట్టుకుంటారన్నారు. తిట్టడం కోసం మనం ఎరినైనా ఎన్నుకుంటామా?.. అలాంటి వాళ్ల వల్ల పనులు జరుగుతాయా?.. మనకు పనులు చేసే వ్యక్తి కావాలని మోడీ అన్నారు.