టీడీపీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా ఆనం రామనారాయణ రెడ్డి. పార్టీపైన, నేతలపైన అసహనం. ఆయన సోదరుడు ఆనం వివేకా మరణించినప్పటి నుంచి ఆయన మౌనం వీడలేదు. దీంతో, ఆయన పార్టీని వీడి, వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం మరింత ఎక్కువైంది. ఈ వార్తలను రామనారాయణ ఖండించకపోవడం మరింత చర్చకు దారితీస్తోంది.