YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మహానాడుకు దూరంగా టీడీపీ

మహానాడుకు దూరంగా టీడీపీ

తిరుపతి, మే 18
మహానాడు.. తెలుగుదేశం పార్టీకి పండుగ రోజు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా యాట మే 28న, దానికి ముందు ఒకరోజు, తరువాత ఒకరోజు పసుపు పండుగ మహానాడును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. కానీ ఈసారి ఎన్నికల కారణంగా మహానాడు ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో.. పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం కుదరని పని. అందుకే రద్దు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టిడిపి మహానాడు ను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. మూడు రోజులపాటు నిర్వహించే మహానాడుకు భారీ సంఖ్యలో టిడిపి శ్రేణులు వస్తాయి. అధికారంలో ఉన్నా లేకున్నా పసుపు పండుగను ఘనంగా నిర్వహించడం కొనసాగుతూ వస్తోంది.అయితే ఈ ఏడాది ఎన్నికలతో ఆ ఆనవాయితీకి బ్రేక్ పడింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈనెల 13న పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలను వెల్లడించునున్నారు. గత మూడు నెలలుగా టిడిపి శ్రేణులు అహోరాత్రులు శ్రమించాయి. క్షణం తీరిక లేకుండా గడిపాయి. మరోవైపు మహానాడు పార్టీ కార్యక్రమం కావడంతో ఎన్నికల కోడ్ అడ్డంకి గా మారింది. ఈ తరుణంలో మహానాడు ను చంద్రబాబు రద్దు చేసినట్లు సమాచారం.2019 ఎన్నికల్లో సైతం ఇదే మాదిరిగా మహానాడు రద్దు అయ్యింది. ఆ ఎన్నికల్లో మే 23న ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. దీంతో మహానాడును నిర్వహించలేదు. అటు తరువాత సంవత్సరం ప్రకాశం జిల్లాలో మహానాడు నిర్వహించి పార్టీకి జవసత్వాలు నింపారు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో సైతం ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ ఏడాది ఎన్నికల్లో గెలిచిన తర్వాత మహానాడు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే… చంద్రబాబు సీఎం బాధ్యతలు తీసుకున్నాక మహానాడును నిర్వహిస్తారని తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి

Related Posts