YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కార్యకర్తల్లో నైరాశ్యం

కార్యకర్తల్లో  నైరాశ్యం

విజయవాడ, మే 18,
సాధారణంగా పోలింగ్ అయ్యాక పార్టీ ముఖ్యులతో సమీక్షిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. పార్టీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఒక నిర్ణయానికి వస్తారు. కానీ జగన్ అలా చేయలేదు. అధికారంలోకి వస్తున్నాం అంటూ ఐ ప్యాక్ టీంకు చెప్పడం విపక్షాలతో పాటు సొంత పార్టీ వారిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోలింగ్ ముగియగానే పార్టీ నేతలతో సమీక్ష జరిపో.. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసో అధికారంలోకి రాబోతున్నాం అని చెబితే బాగుండేది. కానీ ఇలా ఐప్యాక్ టీం దగ్గర చెప్పడం ఏమిటో అని ఆశ్చర్యపోతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐప్యాక్ సర్వస్వంగా మారింది. పార్టీ సీనియర్ల కంటే ఐప్యాక్ ప్రతినిధులకే విలువ ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా ఎవరు ఏం మాట్లాడాలన్న దానిపై స్క్రిప్టు ఇచ్చేది ఐ ప్యాక్… చివరకు పెట్టుబడుల సదస్సులో కూడా పెట్టుబడిదారులుగా వచ్చింది ఐప్యాక్ వాళ్లే కదా? అని సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి. పిఠాపురంలో కాపులు వారే.. జగన్ మామకు మేనకోడలు, మేనల్లుడు వారే.. సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా నటించింది వారే అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు కూడా భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. వీరిని ఎక్కడో చూసినట్లు ఉంది కదూ అంటూ జగన్తో ఐప్యాక్ టీం తీసుకున్న సెల్ఫీ ని పెట్టి మరి పోస్టులు పెడుతున్నారు.జగన్ వైఖరిని సొంత పార్టీ శ్రేణులే తప్పు పడుతున్నాయి. తాము అధికారంలోకి రాబోతున్నాం అనే విషయం ముందుగా కేడర్ కి చెప్పాలి. తరువాత ప్రజలకు చెప్పాలి. కానీ అధికారంలోకి తీసుకువచ్చేందుకే కోట్ల రూపాయలు తీసుకునే ఐ ప్యాక్ కు చెప్పడం ఏమిటో అర్థం కావడం లేదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి రావడానికి స్ట్రాటజీలు ఇచ్చింది ఐప్యాక్ వాళ్లే కదా? తిరిగి వారికి చెప్పడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అందుకే జగన్ మాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.సొంత పార్టీ క్యాడర్ను సైతం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. జగన్ వారికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, కౌగిలించుకొని సెల్ఫీలు దిగడం వంటి వాటిని వైసిపి శ్రేణులు తప్పుపడుతున్నాయి. కొందరు సొంత పార్టీ వారే సెటైర్లు వేస్తున్నారు. ఐ ప్యాక్ కు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీ క్యాడర్ కు ఇచ్చి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని సొంత పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధినేత తీరును తప్పుపడుతున్నారు.2018 లో ఈ తరహా పదోన్నతులు సంఖ్య కేవలం 8 శాతం మాత్రమే ఉండగా ప్రముఖ కాంపెన్సేషన్ కన్సల్టెన్సీ సంస్థ పర్ల్ మేయర్ ప్రస్తుతం దాదాపు 13 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపు లేని డ్రై ప్రమోషన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాయని తన నివేదికలో పేర్కొంది. మెర్సెర్ అనే మరో కన్సల్టెన్సీ సంస్థ 900 కంపెనీలపై జరిపిన సర్వేలో 2023తో పోలిస్తే 2024 లో ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగులకు జీతం పెంచకుండా ప్రమోషన్ ఇచ్చేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు తేలింది. ఏది ఏమైనా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం జాబ్ మార్కెట్లో వస్తున్న ప్రతి నూతన ట్రెండ్ కూడా కంపెనీల ప్రయోజనాలను గరిష్టం చేసుకుంటూనే ఉద్యోగుల శ్రమ దోపిడీకి నూతన మార్గాలను అన్వేషిస్తున్నాయని చెప్పవచ్చు.

Related Posts