తిరుమల
తిరుమలలో భక్తుల పోటెత్తారు... వేసవి సెలవులు దృష్ట్యా ఏడుకొండల పై ఎటు చూసినా భక్తజన సందోహం కనిపిస్తోంది... అనూహ్యంగా పెరిగిన రద్దీతో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకు నేందుకు 24 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్ల తో పాటు రింగ్ రోడ్ లోని మూడు కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేసి ఉన్నారు మరో వైపు మధ్యాహ్నం నుంచి తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది ఎంతో వెలుపల క్యూ లైన్ లో ఉన్న భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు... స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చే భక్తులు తలదాచుకునేందుకు తాత్కాలిక షెడ్లు వైపుకు పరుగులు తీశారు...వర్షంతో ఒక్కసారిగా తిరుమలలో వాతావరణం పూర్తిగా చల్లబడింది...ఘాట్ రోడ్డులో ప్రయాణించే ప్రయాణికులకు వర్షం కారణంగా నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్లాలని టిటిడి సూచిస్తుంది.