YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఖరిఫ్ సాగు కు సమాయత్తం అవుతున్న రైతాంగం

ఖరిఫ్  సాగు కు సమాయత్తం అవుతున్న రైతాంగం

కోనసీమ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ  జిల్లలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో ఖరిఫ్  సాగు కు రైతాంగం సమాయత్తం అవుతోంది..  . ఒకవైపు రుతుపవనాల ముందుగానే వస్తున్నాయన్న అధికారుల సమాచారంతో రైతాంగం నారుమడులకు సిద్దం అవ్వుతోంది . మరోవైపు ప్రధాన పంటకాలువలు అద్వాన్న స్థితిలో చెత్త చెదారం తో నిండి శివారు ప్రాంత భూములకు నిరందే పరిస్థితి వుండదేమోనన్న ఆందోళన రైతన్నలను కలవరపెడుతోంది .వేసవిలో కాలువలు కట్టి పదిరోజులు గడుస్తున్న ప్రధాన పంటకాలువల్లో పూడికతిత పై ద్రుష్టి సారించని అధికార యంత్రాంగం . రబీ సీజనులో  గోదావరి జలాలు అడుగంటిపోవడంతో కోనసీమ ప్రాంతంలో గల ఇలాండ్స్ కు సాగునీరు అందలేదు . దీనితో ప్రధానంగా పి.గన్నవరం , అయినవిల్లి ,ఉప్పలగుప్తం , అల్లవరం , మామిడికుదురు మండలాలతో పాటు పలు ప్రాంతాలతో ఈ సాగు నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాయి . సాగునీరు అందక ఆశించిన ఫలితం దక్కక రైతుల కష్టాలుఅంతా ఇంతా కాదు  రబీ సీజను లో  వరి చేలు ఊడ్చి చేను ఈనే సమయానికి సాగు నీరు అందక  నానా ఇబ్బందులుఎదుర్కొన్న రైతులు  . ఇప్పుడు ఖరిఫ్ సీజను రానే వచ్చింది . ఈ తరుణం  నుంచి నారుమడులు వేసుకోవడానికి   ఇబ్బంది లేకుండా సాగు నీరు పుష్కలంగా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను వేడుకొంటున్నారు  .మరి ఇలాంటి సమయంలో నీరు అందక పోతే నష్టం వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు . ప్రధానంగా శివారు ఆయకట్టకు  నీరు చేరటం లో జాప్యం అవుతుంది. ఈ కారణంగా అక్కడ 23 వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు రబీ వరి సాగు చేశారు. సాగునీరు కొంత మంది రైతులకు అందినా మరికొంతమంది రైతులకు అందక  పలువురు రైతులు ఆయిల్ ఇంజన్లు పెట్టి నీరు తోడుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు రబీలో సాగు నీటి ఎద్దడి లేకుండా వంతుల వారి విధానం అమలు చేస్తున్నా. శివారు ఆయకట్టుకు అసలు నీరు చేరని పరిస్థితులు ఉంటున్నాయి .సరైన  సమయంలో నీరు  అందక పోతే పంటలు   దెబ్బతింటాయని  రైతులు వాపోతున్నారు . ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికివస్తుందో లేదోనన్న భయం రైతన్నను వెంటాడుతోంది . ఎరువులు పురుగుమందుల ధరలు ఆకాశాన్ని అంటినా , వడ్డీకి అప్పుతెచ్చి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నామని , ఇప్పుడు ఈ నీటి ఎద్దడి ఏర్పడిందని ,ఇలాగైతే వ్యవసాయాలు చెయ్యలేమని రైతులు వాపోతున్నారు . ప్రభుత్వాలు డెల్టా ఆధునీకరణ కోసం ప్రతి ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఇరిగేషన్ అధికారుల సమన్వయ లోపంతో రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి . ఇకనైనా ప్రభుత్వం అధికారులు , రాజకీయ నాయకులు డెల్టా అబివృద్ది చేసి సాగునీటి ఎద్దడి ఏర్పడకుండా శివారు భూములకు సైతం సాగునీరు అందించేలా కృషి చెయ్యాలని రైతులు ముక్తకంటం తో కోరుకుంటున్నారు .
 

Related Posts