కథానాయకుడు కల్యాణ్‌రామ్ తన సోదరుడు ఎన్టీఆర్ ఛాలెంజ్‌ను స్వీకరించారు. కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.ఇటీవల మలయాళ నటుడు మోహన్‌లాల్ ఛాలెంజ్‌ను స్వీకరించి, తారక్‌ను ట్యాగ్ చేశారు. తారక్ కూడా దీన్ని స్వీకరించి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను పంచుకున్నారు. తన సోదరుడు కల్యాణ్ రామ్‌కు సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో కల్యాణ్‌రామ్ తాజాగా ఫిట్‌నెస్ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘ఛాలెంజ్ స్వీకరించా నాన్న తారక్. నా రోజువారి వ్యాయామం వీడియో ఇదిగో. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండండి. అల్లు అర్జున్, రామ్, సాయిధరమ్ తేజ్ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Challenge accepted nanna @tarak9999 .. Here's a glimpse of my daily fitness routine with @afzalfitnesspal. Stay fit. Stay healthy. I now nominate @alluarjun @ramsayz @IamSaiDharamTej for the #HumFitTohIndiaFit challenge pic.twitter.com/4odbum3gux
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) 2 June 2018