తిరుపతి, మే 20
మంత్రి ఆర్కే రోజా గెలుస్తారా.. ఓడిపోతారా..? ఇప్పుడు రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మరీ ముఖ్యంగా గెలుపానన్న ఉత్సాహము ఆమెలో కనిపించడం లేదని క్యాడర్ భావిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల పోలింగ్ రోజే వైసీపీ నేతలే సైకిల్ కి ఓటు వేయమంటూ ప్రచారం చేస్తారని మాట్లాడటం.. ఆమెలో భయానికి కారణమని భావిస్తున్నారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలున్నట్లు నగరిలో ఫైర్ బ్రాండ్ రోజా ఎందుకు డీలపడింది. తన ఓటమి గురించి ఎందుకు మాట్లాడుకుంటారు అనేది చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా అంటే ఆరు నెలల ముందు నుంచే డివైడ్ టాక్ ప్రారంభమయింది. అసలు టిక్కెట్ విషయంలోనే రోజాపై పెద్ద ఎత్తులో చర్చ నడిచింది. కానీ టికెట్ దక్కించుకుని పోటీలో నిలబడారు. ఇప్పుడు నెక్ట్స్ ఆమె గెలుస్తారా లేదా అన్న టాక్ విపరీతంగా నడుస్తోంది. అందులో ఆమె క్యాడర్ లోనూ, రోజా ఫేస్ లోనూ ఎక్కడా గెలుపు ధీమా కనిపించడం లేదంట. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రోజా రూటు మార్చింది. అప్పటివరకు పార్టీకి అండదండలుగా ఉన్న నేతలను అధికారానికి దూరం చేసింది. అదే సమయంలో కుటుంబ సభ్యులకు తెరపైకి తెచ్చి.. పదవులు అప్పజెప్పింది. స్థానిక సంస్థలు ఎన్నికల్లోనూ సీనియర్ నాయకులను కాదని తన సొంత మనుషులని టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి పదవులు కట్టబెట్టారు రోజా. దీంతో వైసీపీలో అసమ్మతి నాయకులు ఎక్కడ తమ సమ్మతిని దాచుకోకుండా ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తామని బాహాటంగానే ప్రకటించారు. తన సినీ గ్లామర్ తో పాటు జగన్ సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని రోజా భావిస్తున్నారు. మరోవైపు నగర నియోజకవర్గం లో తమిళ ఓటర్లు తన భర్త ద్వారా తనను ఆదరిస్తారనే భావనతో ఉండగా.. రోజాకు చేనేత సామాజిక వర్గం మొత్తం దూరమైంది. అందుకు కారణం… పవర్ లూమ్ కార్మికులకు విద్యుత్ బిల్లుల శాపంగా మారడం. దీంతో వారు బాహాటంగా వైసిపి ప్రభుత్వాన్ని , రోజాను వ్యతిరేకించారు. ముఖ్యంగా చేనేత కార్మికులంతా చెన్నై వెళ్లి క్యాటరింగ్ కార్మికులుగా మారారు. రోజా నోటి దురుసు కూడా పార్టీకి ఇబ్బందిగా మారింది అనేది బహాటంగానే చెప్పుకుంటారు. ప్రతి విషయంలో టీడీపీ అధినేతను ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి నగరిలో చాలామంది మధ్యతరగతి వర్గాన్ని ఆమెకు దూరం చేసిందని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడుకి ఉన్న ఇమేజ్ కూడా ఆమెకు వ్యతిరేకంగా మారింది. చంద్రబాబు అరెస్టు సమయంలో టపాసులు కాల్చి డాన్సులు చేయడం ఆమె పై ఉన్న వ్యతిరేకతను మరింత పెంచింది. ఇక గత ఎన్నికల్లో గాలి భాను ప్రకాష్ కుటుంబం విభేదాలు ఆమెకు సాయపడ్డాయి. కానీ ఈసారి వారి కుటుంబ సభ్యులు సైలెంట్ గా ఉండడం తో గాలి భాను కు ఈ అంశం ప్లస్ అయిందనే టాక్ నడుస్తోంది.ఎన్నికల సమయంలో ఒకేసారి సీనియర్ నాయకులు మొత్తం వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడంతో ఆ ఓటు బ్యాంకు అంతా టీడీపీ కి సహకరించిందని తెలుస్తోంది. దీంతో రోజా ఓటమి ఖాయం అన్నట్లు నియోజవర్గంలో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద 2014లో కేవలం 8 వందలు, 2019లో 2000 ఓట్ల మెజార్టీతో గెలిచిన రోజా.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పట్టించుకోవడంలేదని విమర్శలు కూడా ఉన్నాయి. టూరిజము శాఖామంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఉన్న జలపాతాలను కనీసం అభివృద్ధి చేయలేదని స్థానికులు అంటున్నారు.మొత్తం మీద బలమైన మొదలయ్యారు సామాజిక వర్గం నాయకులు దూరంకావడం, స్థానికంగా నియోజకవర్గంలోనే వైసీపీ నాయకుడు వ్యతిరేకించడం ఆమె ప్రస్తుత పరిస్థితి కారణమంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు గాలి భాను ప్రకాష్ కుటుంబాన్ని సైతం వదిలి నియోజకవర్గంలోనే నిరంతరం ఉండడం అతనికి ప్లస్ అయింది. మరోవైపు భాను ప్రకాశ్ మీద దాడి చేయించడం, గాలి ముద్దు కృష్ణమనాయుడు వారసుడు కావడం, ప్రజల అండదండలు ఉండటం టీడీపీ అభ్యర్థికి ప్లస్ అయింది. మొత్తం మీద జిల్లాలో ఎవరు గెలిచినా గెలవకపోయినా రోజా ఓటమి మాత్రం ఖాయమంటున్నారు నగరి ప్రజలు. చూడాలి మరి ఫలితాలు ఏం తేలుస్తాయో.