YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నేతల విదేశీ బాట

నేతల విదేశీ బాట

విజయవాడ, మే 20
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నాయి. మొన్నటిదాకా మైకులు హోరెత్తేలా ప్రసంగించిన వారంతా.. ఇప్పుడు మౌనంగా ఉన్నారు. అందరూ జూన్ 4 ఎప్పుడు వస్తుందా.. ఆ రోజు ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ లోగా.. కొంతమంది నేతలు రిలాక్స్ కోసం విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆల్రెడీ లండన్ వెళ్లిపోయారు. ఇప్పట్లో ఆయన తిరిగి రారు. లండన్ నుంచి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లి ఆ తర్వాత ఈ నెల 31న ఏపీలోని తాడేపల్లికి వస్తారు. అందువల్ల జగన్ రెండు వారాల విదేశీ ట్రిప్ పెట్టుకున్నారని అనుకోవచ్చు.జగన్ చెల్లి, APCC చీఫ్ వైఎస్ షర్మిల కూడా విదేశాలకు వెళ్లినట్లు తెలిసింది. అమెరికాలో ఉన్న తన కొడుకు రాజారెడ్డి దగ్గరకు షర్మిల వెళ్లినట్టు సమాచారం. ఇటీవలే పెళ్లైన రాజారెడ్డి దగ్గరే.. షర్మిల తల్లి విజయలక్ష్మి కూడా ఉన్నారు. కొన్ని రోజులు అక్కడ ఉన్నాక.. జూన్ 2న విజయమ్మతో కలిసి షర్మిల ఇండియాకు వస్తారని తెలుస్తోంది.టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అమెరికా వెళ్లారు. ఐతే.. ఆయన రిలాక్స్ కోసం కాకుండా.. హెల్త్ చెకప్ కోసం వెళ్లారని తెలిసింది. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి యూఎస్‌కి సతీ సమేతంగా వెళ్లిన చంద్రబాబు.. వచ్చే వారం తిరిగి వస్తారని సమాచారం. అటు కొడుకు నారా లోకేష్ కూడా కొన్ని రోజుల కిందట ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లారుఇలా కీలక నేతలంతా విదేశాలకు వెళ్తుంటే.. ఏపీ లోని ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు.. జూన్ 4 ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈసారి ఏపీలో ఓ పరిణామం కనిపిస్తోంది. అటు వైసీపీ, ఇటు కూటమి పార్టీలు.. వేటికవే భారీ మెజార్టీ తమ సొంతం అని చెబుతున్నాయి. విశ్లేషకులు కూడా ఎటూ తేల్చలేకపోతున్నారు. రెండువైపులా ప్లస్సులూ, మైనస్సులూ చెబుతున్నారే తప్ప.. కచ్చితంగా గెలుపు ఎవరిది అనేది వారు కూడా అంచనా వెయ్యలేకపోతున్నారు. ఐతే.. ఎవరు గెలిచినా ఏపీకి మంచిదే అని కొందరు అంటున్నారు. ఈ కారణంగానే బెట్టింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో!

Related Posts