YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇక పంచాయతీ పోరు..

ఇక పంచాయతీ పోరు..

నాగర్ కర్నూల్
పల్లెల్లో పంచాయితీ ఎన్నికల వేడి మొదలైంది. ఆశావహుల సందడి పెరిగింది. ఇటీవలే పార్ల మెంటు ఎన్నికలు జరగగా రాబోయేవి గ్రామ పంచాయతీ ఎన్నికలే కావడంతో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో సహకరించిన నాయకులకు ప్రస్థుతం ఎన్నికల్లో అవకాశాలు లభించనున్నాయి. పంచాయితీ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లలో ఉన్నారు. ఏనమయంలో నైనా నోటిఫికేషన్ వస్తుందనే ఆలోచనలో అధికారులు సిద్ధమై యడంతో ఉన్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా పచ్చజెండా ఊపి ఎన్నికల నిర్వహణ కోసం కసరత్తు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తుంది. జూన్ చివరివారం లో గ్రామ ప్రథమ పౌరుడి ఎన్నిక కోసం ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. అలాగే జులై మాసం చివరి కల్లా జడ్పిటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సైతం ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
సిద్దమవుతన్న నాయకులు, యువత
స్థానిక సంస్థల ఎన్నిల కోసం గ్రామీణ. ప్రాంతాల నాయకులు. యువకులు ఇప్పటి నుంచె సమాలోచనలు చేస్తున్నారు.ఏ గ్రామంతో ఏ రిజర్వేషన్ వస్తుందోనని సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. పాత రిజర్వేషన్ ఉంటుందా.
లేదా, మార్పు తుండా అని బేరీజు వేసు కుంటున్నారు. వారీగా రిజ ర్వేషన్ల ఎవరైతే బాగుంటుదోనని పేర్లను ఖరారు చేసే పనిలో పార్టీల నాయకత్వం కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి నుంచే ఆశావాహులు రంగంలోకి దిగుతున్నారు. ఆర్థికంగా ఉన్న నాయకులను నిలబెట్టేందుకు పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. లింగాల మండలంలో 23 పంచాయితీలు ఉన్నాయి.గత ఎన్నికల్లోరెండు మూడు మినహ అన్నీ అప్పుడు అదికారంలో ఉన్న బిఆర్ఎన్ఎ్పర్టీ కైవసం చేసుకోగా, ప్రస్తుతం పంచాయితీల్లో అధికారుల పాలన కొనసాగుతుంది.
అధికారపార్టీ మద్దతు ఉంటేనే గెలుపు
రాష్ట్రంలో అధికారంలో ఉన్నపార్టీ మద్దతు ఉంటేనే గెలువు సాధ్యమవుతుందని, ఆపార్టీ నుంచే టికెట్ పొందేందుకు ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యక్తి ముఖ్యమని, పార్టీ కాదని.
గ్రామపంచాయతి కార్యాలయము
మరికొందరు వాదిస్తున్నారు. ఏ పార్టీ తరపున ఎవరికి పోటీ ఉంటుందో ఇప్పటి నుంచే గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. జూన్ చివరి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటున్నాయని" సిఎం రేవంత్ ప్రకటించటంతో పల్లెల్లో ఇప్పటి నుండి ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరి కొందరు రిజర్వేషన్ అనుకూలిస్తే సర్పంచ్ నీకు, ఎంపీటీసీ నాకు అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. ఏదీ ఏమైనా పార్లమెంట్ ఎలక్షన్ ముగిసిన వెంటనే స్థానిక సంస్థల సమరం ఉండడంతో గ్రామాల్లో ఓటర్లకు ఇక పండగేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 

Related Posts