YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

2028 కోసం బీజేపీ వ్యూహాత్మక అడుగులు

2028 కోసం బీజేపీ వ్యూహాత్మక అడుగులు

హైదరాబాద్, మే 20
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత కీలకంగా మారాయి. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం ప్రభుత్వ మనుగడపై ఉంటుందన్న చర్చ ఎక్కువగా ఉండటమే.  కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కవ సీట్లు వస్తే..  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఏ మాత్రం సహించని బీఆర్ఎస్ చీఫ్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పారు. బీఆర్ఎస్ తరపున బీజేపీకి ఈ విషయంలో సాయం చేశారన్న గుసగుసలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.  కొన్ని స్థానాల్లో బలహీన అభ్యర్థులను పెట్టడం.. కొన్ని స్థానాల్లో పెద్దగా ప్రచారం  చేయకపోవడం వంటి వ్యూహాల ద్వారా బీజేపీకి మేలు చేశారని అంటున్నారు. కానీ ఇది బీజేపీతో ఒప్పందం చేసుకుని చేసింది కాదని .. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సొంత రాజకీయమన్న అభిప్రాయం ఎక్కువగా ఉంది. ఎందుకంటే.. రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేయడం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి  ఆ ప్రభుత్వం ఉండదని పదే పదే అభిప్రాయం చెప్పేవారే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు. ఎలా జరుగుతుందో కూడా విశ్లేషించేవారు.  పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పరిమితంగా సీట్లు వస్తాయని.. ఆ తర్వాత బీజేపీ ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తుందని అంచనాలు వేస్తూ వచ్చారు.  కేసీఆర్ కూడా తమ పార్టీ సమావేశాల్లో ఇవే చెబుతూ వచ్చారు. వందకుపైగా ఎమ్మెల్యేలు ఉన్న తన ప్రభుత్వాన్నే కూల్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని కాంగ్రెస్ కు సహించే ప్రశ్నే ఉండదని ఆయన అభిప్రాయం.  ఈ పరిస్థితి తీసుకు రావడానికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో కేసీఆర్ బీజేపీకి సహకరిస్తున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని తేల్చేందుకు బీజేపీకి సైలెంట్ గా సపోర్టు చేశారని.   ఫలితంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోరాటం లోక్ సభ ఎన్నికల్లో జరిగిందని అంటున్నారు.  కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఒక్క సీటు ఎక్కువగా వస్తే  అసలు కథ ప్రారంభమవుతుందని  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నారని అనుకోవచ్చు.  బీఆర్ఎస్ ప్లాన్ ప్రకారం.. బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తే  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి.. బీఆర్ఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేసీఆర్  అనుకుంటున్నారు.  నిజానికి  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే కాంగ్రెస్  ఎమ్మెల్యేలను కూడా ఆకర్షించాలి.  అలా చేసినా  బీఆర్ఎస్ సాయంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటంది. చెడ్డ పేరు అంతా  బీజేపీకి వస్తుంది. కానీ అధికారంలో బీఆర్ఎస్ కు భాగస్వామ్యం లభిస్తుంది. కేసీఆర్ ఇదే ఆలోచించారని అంటున్నారు.  కానీ బీజేపీ ఈ విషయంలో అంత తేలికగా కేసీఆర్ ట్రాప్ లో పడే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు  వస్తే తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే ప్రయత్నం బీజేపీ  చేస్తుందని..  ఉన్న పళంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేసి.. ఆ పార్టీతో కలిసి అధికారం చేపట్టాలని అనుకోకపోవచ్చనని చెబుతున్నారు. బీజేపీ ప్రధమంగా బీఆర్ఎస్ పైనే దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.  బీఆర్ఎస్  ఉనికిని వీలైనంతంగా పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తుంది. కిషన్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు . వచ్చే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి ఉండదని అంటున్నారు.  ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ కనీస బలం చూపించలేకపోతే ముఖ్యంగా గట్టి ఓటు బ్యాంక్ ను కాపాడుకోలేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆ పార్టీకి చెందిన క్యాడర్ ను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పంచుకుంటాయి. ఎక్కువగా బీజేపీ పంచన చేరిపోతారు. ఎందుకంటే.. మరో రెండు, మూడేళ్ల తర్వాత అయినా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నిలబడే పార్టీగా బీజేపీనే  చూస్తారు. అందుకే ఆ పార్టీలో చేరిపోతారు. బీఆర్ఎస్ బలహీనపడుతుంది. క్రమంగా బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తుంది. ఎమ్మెల్యేల చేరికలతో అసెంబ్లీలోనూ  ప్రతిపక్ష స్థానానికి చేరుతుంది బీజేపీ. తాము బలపడేందుకు అయినా..  బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేసేందుకు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న పరిస్థితి ఉన్నట్లుగా తెచ్చేందుకు ప్రధానంగా కొంత కాలం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం జోలికి వచ్చేందుకు బీజేపీ సిద్ధపడదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల కారణంగా ఇవాళ కాకపోతే రేపైనా ప్రజలు ప్రభుత్వంపై తిరుగబడతారన్న భావన బీజేపీలో ఉంది. ఎంత అసంతృప్తి చెందితే బీజేపీకి అంత మేలు జరుగుతుంది. ఇంత కాలం అన్ని పార్టీలకు చాన్సిచ్చారు.. బీజేపీకి  ఒక్క చాన్స్ ఇవ్వమని అడగితే.. ప్రజలు స్పందించే అవకాశం ఉంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరూ ఊహించుకుంటున్నట్లుగా బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఉందు. కానీ బీఆర్ఎస్ కు మాత్రం బీజేపీ నుంచి పెను సవాళ్లు  ఎదురు కానున్నాయి.

Related Posts