సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు అమెరికా టీనేజర్లు షాకిచ్చారు. ఫేస్‌బుక్‌ను పక్కన పెట్టేసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌లపై పడ్డారు. దీంతో నిన్నమొన్నటి వరకు అగ్రస్థానంలో ఉన్న ఫేస్‌బుక్ ఒక్కసారిగా నాలుగో స్థానానికి పడిపోయింది.13-17 ఏళ్ల మధ్య టీనేజర్లలో దాదాపు సగం (51 శాతం) మంది ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తుండగా, యూట్యూబ్, ఫేస్‌బుక్‌కే చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లను ఎక్కువమంది ఉపయోగిస్తున్నట్టు ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ సర్వేలో తేలింది.