YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

యాదాద్రిలో భక్తులకు డ్రెస్ కోడ్

యాదాద్రిలో భక్తులకు డ్రెస్ కోడ్

నల్గోండ, మే 20
యాదాద్రి ఆలయ పరిధిలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో ప్లాస్టిక్‌పై నిషేధం విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ , వస్తువులు, కవర్లను నిషేధిస్తూ యాదాద్రి ఆలయ కార్యనిర్వహణాధికారి దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ , వస్తువులు, కవర్ల స్థానముల్లో ప్లాస్టికేతర వస్తువులను మాత్రమే వాడాలని పేర్కొన్నారు.
ఆ భక్తలకు డ్రెస్ కోడ్….
తిరుమల తరహాలోనే యాదాద్రిలో మరో నిర్ణయం అమల్లోకి రానుంది. వీఐపీ బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులు డ్రెస్ కోడ్ (సంప్రదాయ దుస్తులు) తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఆలయ ఈవో స్పష్టం చేశారు. ఆర్జిత పూజల్లో పాల్గొనే భక్తులు కూడా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుందని తెలిపారు. జూన్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ధర్మ దర్శనం క్యూలైన్లో వచ్చే భక్తులకు ఈ నియమం వర్తించదన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20 జయంత్యుత్సవాలు ప్రారంభం కానున్నాయి. 22 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. 20వ తేదీన ఉదయం స్వస్తివాచనం, పుణ్యాహవచనం, లక్షకుంకుమార్చన పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తిరువెంకటపతి అలంకార సేవోత్సవం కూడా నిర్వహిస్తారు.
యాదాద్రి టూర్ ప్యాకేజీ…
యాదాద్రితో పాటు మరికొన్ని ఆలయాలను చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. అతి తక్కువ ధరలోనే ప్రతి శనివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. https://tourism.telangana.gov.in/p  వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.
యాదగిరిగుట్ట టూర్ ప్యాకేజీ వివరాలు…
తెలంగాణ టూరిజం  ను ప్రకటించింది.
హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
ప్రతి శనివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
ఏసీ మినీ కోచ్ లో జర్నీ ఉంటుంది.
టికెట్ ధరలు - పెద్దలకు రూ. 1499, పిల్లలకు రూ.1199
కేవలం ఒకే ఒక్క రోజులో ఈ ప్యాకేజీ ముగుస్తుంది.
ఉదయం 9 గంటలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి స్టార్ట్ అవుతారు.
10:30 గంటలకు కొలనుపాకకు చేరుకుంటారు. పురాతన జైన్ ఆలయాన్ని దర్శించుకుంటారు.
11:30 AM గంటలకు కొలనుపాక నుంచి బయల్దేరుతారు.
12:30 PMకు యాదగిరిగుట్టలోని ఆలయాన్ని సందర్శిస్తారు.
1:30 PM to 2:00 PM హరిత హోటల్ లో భోజనం చేస్తారు.
4:30 PM సురేంద్రపురికి వెళ్తారు. ఇక్కడ ప్రముఖ ఆలయాల సెట్టింగ్ లను చూస్తారు,
9:30 PM గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు.
https://tourism.telangana.gov.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుకోవచ్చు.
ఒకే ఒక్క రోజులోనే యాదాద్రితో పాటు మరికొన్ని ప్రాంతాలను చూసేందుకు ఈ టూర్ ప్యాకేజీని ఎంపిక చేసుకోవచ్చు. టూరిజం వెబ్ సైట్ లో మరిన్ని ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి

Related Posts