బెంగళూరు
బెంగళూరు పోలీసులు భారీ రేవ్ పార్టీని భగ్నం చేసారు. సిసిబి పోలీసులు సుమారుగా 100 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాంకర్డ్ సంస్థకు చెందిన రామకృష్ణ రెడ్డి ఫార్మ్ హౌస్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. పార్టీలో కొకైన్, ఎండిఎంయే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 25 మంది యువతులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దాదాపు పదిహేను విలాసవంతమయని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి అధికారిక స్టిక్కర్ వున్న మెర్సిడెస్ కారు కుడా లభించింది