తాడిపత్రి
అనంతపురం రేంజ్ డి.ఐ.జి షిమోషి, జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆదేశాలతో ఈరోజు మాక్ డ్రిల్, ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు పికెట్లు, మొబైల్ పార్టీల గస్తీలు, వెహికల్ చెకింగులు ముమ్మరం చేశారు. స్థానిక పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏపీఎస్పీ బలగాలు, ఏ.ఆర్ బలగాలను మొహరింపజేసి ఆయా విధుల్లో నిమగ్నం చేశారు.