బెంగళూరు, మే 20
బెంగళూరులో ఓ రేవ్ పార్టీని అక్కడి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) భగ్నం చేశారు. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఓ ఫాం హౌస్‌లో ఈ పార్టీ జరిగింది. స్థానిక జీఆర్ ఫామ్ హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించినట్లుగా బెంగళూరు సీసీబీకి సమాచారం అందడంతో వారు ఆకస్మిక దాడులు చేశారు. ఈ రేవ్ పార్టీలో భారీగా లిక్కర్ తో పాటుగా పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా యువతీయువకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. జీఆర్ ఫామ్‌హౌస్ అనేది హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యక్తికి చెందినది పోలీసులు గుర్తించారు. ఆయన గోపాల్ రెడ్డికి చెందినదని పోలీసుల విచారణలో తేలింది. రేవ్ పార్టీలో పోలీసులు మాదక ద్రవ్యాలను భారీగా గుర్తించారు. ఈ పార్టీలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నారని తెలిసింది. ఈ రేవ్ పార్టీలో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ పేరుతో పాస్ ఉన్న కారు కూడా గుర్తించినట్లు తెలిసింది. సీసీబీ సోదాల్లో ఎండీఎంఏ సహా పలు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురిని సీసీబీ అదుపులోకి తీసుకుంది. అయితే, సినీ నటి హేమ కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లుగా వదంతులు వచ్చాయి. దీనిపై ఆమె స్పష్టత ఇచ్చారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదు. అనవసరంగా నన్ను లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని సినీ నటి హేమ తెలిపారు.
పార్టీలో లీడర్లు, టాలీవుడ్ సెలబ్రిటీలు
బెంగళూరులో జల్సా చేస్తూ పట్టుబడ్డ 100 మందికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్.. ఈ పార్టీకి పలువురు లీడర్లు, టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరైనట్టు బెంగళూరు మీడియా రిపోర్ట్ చేస్తోంది. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌పై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దాడి చేసింది. G.R ఫామ్‌హౌస్‌లో తెల్లవారుజాము 3గంటల వరకు పార్టీ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. తనిఖీల్లో డ్రగ్స్ కూడా పట్టుబడటం సంచలనంగా మారింది. 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బెంగళూరు, ఏపీ, తెలంగాణ నుంచి 100 మందికి పైగా హాజరయినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నట్లు చెబుతున్నారు.GR ఫామ్‌హౌస్.. అంటే గోపాల్‌రెడ్డి ఫామ్‌హౌస్..? కాన్ కార్డ్ యజమాని గోపాల్‌రెడ్డి.. ఈయన ఫామ్‌హౌస్‌లో ఇంత పెద్ద పార్టీ ఎందుకు జరిగింది..? తెలంగాణకు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని హోస్ట్ చేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌కి చెందిన వాసు పూర్తి డీటెయిల్స్ ఏంటి..? పుట్టినరోజును ఇంత గ్రాండ్‌గా ఎందుకు ప్లాన్ చేశారు..? 100 మందిని పిలిచారు.. ఇందులో VVIPలు, సెలబ్రిటీలు ఉన్నట్టుగా చెప్తున్నారు. దీనిపైనే ఇప్పుడు పూర్తి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు బెంగళూరు ఎలక్ట్రానికిక్ సిటీ పోలీసులు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే ఈ రేవ్ పార్టీపై కేసు నమోదు చేసింది.ఈ రేవ్ పార్టీకి హైఎండ్, పోష్ కార్లు చాలా వచ్చాయ్. వాటిల్లో ఓ బెంజ్ కార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దానికి కారణం.. ఆ కార్‌పై ఏపీ MLA కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్టిక్కర్ ఉంది. ఈ కారుతో తనకు ఎలంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ కారు తనది కాదని.. తన పేరును ఎవరో వాడుకుంటున్నారని చెప్పారు.
రేవ్ పార్టీకి చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరైనట్టు చెప్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. కన్నడ మీడియాలో నటి హేమ పేరు సర్కులేట్ అవుతోంది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ స్పష్టం చేశారు. రేవ్ పార్టీలో తాను ఉన్నట్టు కన్నడ ఛానెల్స్‌లో, మీడియాలో వచ్చిన వార్తల్ని ఖండించారు.