తిరుపతి
తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఎస్పీతో కలిసి మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ. తిరుపతి జిల్లాలో పోలింగ్ శాతం పెరిగిందన్నారు. 2019ఎన్నికల్లో 78.48 శాతం పోలైతే 2024లో 78.63 శాతం పోలింగ్ నమోదైందన్నారు. తిరుపతి జిల్లాలోనే వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైందని, దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ముగ్గురిపై కేసులు పెట్టామన్నారు. 24వేల పోస్టల్ బ్యాలెట్ పోలైందని..మాన్యువల్ గా లెక్కిస్తామన్నారు. తిరుపతి జిల్లాలో 144సెక్షన్ కొనసాగుతోందని చెప్పారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇవిఎంలు చాలా భద్రంగా ఉన్నాయని తెలిపారు.
తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు మాట్లాడుతూ తిరుపతికి అదనంగా రెండు కేంద్రబలగాలు చేరుకున్నాయన్నారు.కౌంటింగ్ కు గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నామని..మొత్తం 100సిసి కెమెరాలు కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సి.సి.కెమెరాల్లో రికార్డ్ చేస్తామన్నారు.60 ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.పులివర్తి నాని దాడి కేసుకు సంబంధించి 5కేసులు నమోదైందన్నారు.