YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీచర్లపై లాఠీ చార్జీని ఖండిస్తున్నాం

టీచర్లపై లాఠీ చార్జీని ఖండిస్తున్నాం

దేవరకొండ
మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం నాడు దేవరకొండలో మీడియా సమావేశం నిర్వహించార. హరీష్ రావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో బడిపంతుళ్లపై లాఠీ చార్జీలు.. బడుగు జీవులకు జూటా హామీలు. గతంలో ఉపాధ్యాయులపై లాఠీ చార్జీలు జరిపిన దాఖలా లేదు.  విధినిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులపై లాఠీ జరపడాన్ని బీఆర్ఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ ప్రభుత్వ నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయాలను అందర్నీ మోసం చేసింది.విద్యార్థులకు వందరోజుల్లోపల 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని చెప్పి ఏ ఒక్క విద్యార్థికీ కార్డు ఇవ్వలేదు. అమ్మాయిలకు ఉచిత స్కూటీ ఇస్తామన్నారు. ఒక్కరికీ ఇవ్వలేదు. నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేలు ఇస్తామని చెప్పి ఆరునెలలైనా ఇవ్వలేదు. దీనిపై అసెంబ్లీలో మేం ప్రశ్నిస్తే అలాంటి హామీనే ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.భృతి ఇవ్వకపోవడం ఒక మోసమైతే హామీ ఇవ్వలేదని చెప్పడం మరో మోసమని అన్నారు.
అధికారంలోకి రాగానే ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న మూడు డీఏలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడు నాలుగో డీఏ కూడా పెండింగులో ఉంది. రిటైరైన ఉద్యోగులకు పింఛన్ బెనిఫిట్లను రెండు మూడు నెలలుగా ఆపేశారు. రేవంత్ మార్చిలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి డీఏ విడుదల చేస్తామని మోసం చేశారు.  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రశ్నించే గొంతు అయిన రాకేశ్ రెడ్డి గెలిపించండని అన్నారు.

Related Posts