YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిర్మాణ రంగంలో భారత్ ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపింది మోడీ

నిర్మాణ రంగంలో భారత్ ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపింది మోడీ

సూర్యాపేట జిల్లా, మే 20
నిర్మాణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలో నేడు నెంబర్ వన్ స్థానంలో  నిలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదే నని  మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపి పార్టీ జాతీయ నాయకులు బిబి పాటిల్ లు అన్నారు.  కోదాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసనమండలి బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమెందర్ నుండి  విజయాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. 1947 నుండి 2014 వరకు దేశంలో జాతీయ రహదారులు అధ్వానంగా ఉండేవని 2014 నుండి 24 వరకు పదేళ్ల కాలంలో ప్రపంచం గుర్తించిన విధంగా భారతదేశంలో జాతీయ రహదారులు నిర్మించిన రికార్డు మోడీదే అన్నారు. గతంలో రోజుకి 11 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మిస్తే మోడీ పాలనలో రోజుకు 37 కిలోమీటర్ల జాతీయ రహాధారులు నిర్మించారన్నారు. గరీబీ హఠావో అని ఇందిరాగాంధీ నుండి మొదలుకొని నేడు రాహుల్ గాంధీ వరకు అంటున్నారే తప్ప వాళ్ళ హయాంలో పేదలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. దేశంలో 12 కోట్ల మందికి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత మోడీ ప్రభుత్వం అన్నారు.రూ 500,రూ 2000 నోట్లతో చిల్లర కు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఫోన్ పే గూగుల్ పే ద్వారా  నగదు బదిలీలు సులభతరం చేసిన ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం అన్నారు. ఫోన్ పే, గూగుల్ పే లతో నగదు బదిలీలకు పదేళ్లు పడితే మోడీ పాలనలో భారతదేశంలో సగటు మహిళకు మూడు సంవత్సరాలు మాత్రమే పట్టిందని నేడు  మార్కెట్లో ఏది కొనుగోలు చేసిన ఇబ్బందులు లేకుండా ఫోన్ పే గూగుల్ పే లతో నగదు చెల్లింపులు చేస్తూ  అభివృద్ధి చెందారన్నారు . భారతదేశం నుండి మెడిసిన్ చదవడానికి రష్యా ,ఉగ్రామ్ దేశాలకు వెళ్లిన విద్యార్థులు అక్కడ యుద్ధంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతుంటే ఇక్కడి తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకున్న ప్రధాని మోడీ ఆయా దేశాల అధ్యక్షులతో మాట్లాడి ఆ పిల్లలు భారతదేశానికి సురక్షితంగా వచ్చే విధంగా ఏర్పాటు చేశారన్నారు.50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 76 ఏర్పోర్ట్లు ఉంటే పదేళ్ల మోడీ పాలనలో 150 యొక్క ఏర్పాట్లు దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత మోడీ అన్నారు.కాంగ్రెస్ పార్టీ హయాంలో 2జి స్కామ్ లు లక్షల కోట్ల ప్రజాధనం దోపిడీ జరిగిందన్నారు, గతంలో దేశంలో రాష్ట్రంలో బాంబు పేలుళ్లతో శరీరాలు ముక్కలై అరాచక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మోడీ పాలనలో పదేళ్లలో ప్రజలు భయభ్రాంతులను లేకుండా శాంతియుతంగా జీవనం గడుపుతున్నారు .గతంలో దేశంలో జమ్మూ కాశ్మీర్ పంజాబ్ తెలంగాణలో హైదరాబాదులో జరిగిన హింసాత్మక చర్యలను ఆయన వివరించారు. తెలంగాణలో కెసిఆర్ పాలనలో మాటలు కోటలు దాటాయే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రస్తుతం గత రెండు రోజుల నుండి నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్నామని ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కాంగ్రెస్కి ఓటేసి తప్పు చేశామని అంటున్నారని చెప్పారు .కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు పాలిపోతున్న కరెంటు మోటార్లు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. బస్తాకు మూడు కేజీలు నాలుగు కేజీలు తరుగు తీస్తూ రైతులను నష్టపరుస్తున్నారన్నారు. 500 రూపాయల బోనస్ నీటి మూటగానే మిగిలిందన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిట్టలదొర మాదిరిగా ఆరు గ్యారెంటీలు 66 హామీలు 460 రకాల వాగ్దానాలు చేశారే తప్ప ఉచిత బస్సు ప్రయాణం తప్ప అమలైంది ఒక్కటి లేదన్నారు. ఆరు నెలలుగా దవఖానాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు లేక విలవిలలాడుతున్నారన్నారు .కాంగ్రెస్ పార్టీ వచ్చి మళ్ళీ వసూళ్ల రాజ్యం తెచ్చిందని కాంగ్రెస్ పార్టీ మళ్లీ పాత నైజంతో ఉందన్నారు .పట్టబద్రులు ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగులు ఆలోచించి బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి సైదిరెడ్డి మాట్లాడుతూ మోడీ సంక్షేమ పథకాలతో పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి కోదాడ నియోజకవర్గ కన్వీనర్ కనగాల నారాయణ, బొలిశెట్టి కృష్ణయ్య, కనగాల వెంకట రామయ్య, కనగాల నారాయణ, నూనె సులేసన,అంజి యాదవ్, యధా రమేష్, ఓరిగంటి కిట్టు, భాగ్యమ్మ, పురుషోత్తం, హనుమంతరావు, జల్లా జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts