ఛండీఘడ్, మే 21
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. 543 స్థానాలకు వేడి విడుదలు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికే నాలుగు దశల్లో పోలింగ్ పూర్తయింది. ఎన్నికల వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు తమను గెలిపిస్తే అది ఇస్తాం.. ఇది ఇస్తామని హామీలు గుప్పిస్తున్నారు. ఇది సమయంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఓటు అనే ఆయుధాన్ని వాడుకుంటున్నారు. ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. తాజా ఓ సంఘం కూడా తమ డిమాండ్లు నెరవేరిస్తేనే ఓటు వేస్తామని షరతు పెట్టింది. ఆ సంఘం ఏమిటి.. వాళ్ల డిమాండ్లు ఏమిటి అనే వివరాలు చూద్దాం ఎన్నికల వీరా హర్యానాలో బ్రహ్మచారుల సంఘం కీలక డిమాండ్లను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో పెళ్లి కానీ అమ్మాయిలు అబ్బాయిలకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మచారులకు పెన్షన్ పథకాన్ని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది క్రితం పథకం ప్రారంభించిన అమలు మాత్రం జరగడం లేదు. అర్హులను గుర్తించడంలో అలసత్వం వహిస్తున్నారు ఎన్నికల వేళ పథకం అమలు ప్రశ్నిస్తూ రాష్ట్రంలోని బ్రహ్మచారులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారు. నోటి మాటగా హామీ ఇస్తే సరిపోదని లిఖితపూర్వకంగా హామీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయమని తేల్చి చెప్పారు.హర్యానాలో 45 దాటిన పెళ్లి కాని వారు 2022లో అవివాహిత పురుష సమాజం పేరుతో ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘంలో 7 లక్షల మంది సభ్యులుగా ఉండటం గమనార్హం. ఈ సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని గత ఏడాది హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్.. రాష్ట్రంలో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న పెళ్లి కాని స్త్రీ, పురుషులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టారు.హర్యానాలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే బ్రహ్మచారులు ఎక్కువ. రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి లో చాలా వ్యత్యాసం ఉంది. మరోవైపు యువకులకు ఉద్యోగాలు దొరకడం లేదు. దీంతో అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు ఉద్యోగం ఉన్న అబ్బాయిలకే తమ కూతురుని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. దీంతో చాలామంది పెళ్లి కాకుండానే మిగిలిపోతున్నారు. ఈ క్రమంలో 45 నుంచి 60 వీళ్ళ మధ్య వయసు ఉన్న బ్రహ్మచారులకు పెన్షన్ ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.2,750 పెన్షన్ ఖరారు చేసింది.పెన్షన్ పథకం ప్రకటించి ఏడాది దాటిన దాన్ని సరిగా అమలు చేయడం లేదని అవివాహిత పురుషులు ఆరోపిస్తున్నారు. కొంతమందికి మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని పేర్కొంటున్నారు. తమను సమాజం చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సభ్యులందరికీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఎన్నికల వేళ ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు.